చైనాలో యూఎస్ కాన్సులేట్ క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బీజింగ్: చైనాలోని యూఎస్ కాన్సులేట్ ను మూసివేసి తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు చైనా ఫారిన్ ఎఫైర్స్ మినిస్ట్రీ సోమవారం ప్రకటించింది. ‘‘సోమవారం ఉదయం 10 గంటలకు చెంగ్డూ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్​ఆఫీస్ మూసివేశాం. అది ఇప్పుడు పూర్తిగా మా ఆధీనంలో ఉంది”అని పేర్కొంది. కాన్సు లేట్ పై నుండే యూఎస్ జెండాను అధికారులు తొలగించారని అక్కడి మీడియా తెలిపింది. తమ దేశానికి చెందిన కీలక సమాచారాన్ని చైనా దొంగిలిస్తోందనే ఆరోపణలతో యూఎస్ లోని హ్యూస్టన్ సిటీ లో ఉన్న చైనా కాన్సు లేట్ ను ఖాళీ చేయాలని అమెరికా అల్టిమేటం జారీ చేసింది. దీనిని చైనా తప్పుపడుతూ యూఎస్ కాన్సులేట్ లైసెన్స్ రద్దు చేస్తూ ప్రతీకారం తీర్చుకుంది.

Latest Updates