కొచ్చి ఎయిర్ పోర్ట్ ఐసోలేషన్ వార్డ్ లో అమెరికా టూరిస్ట్ దంపతులు

కేరళ ఐసోలేషన్ వార్డ్ నుంచి తప్పించుకున్న అమెరికాకు చెందిన దంపతులు ఇప్పుడు కొచ్చి ఎయిర్ పోర్ట్ ఐసోలేషన్ వార్డ్ లో ఉన్నట్లు తేలింది. అమెరికాకు చెందిన భార్య భర్తలు మార్చి 9 న లండన్ నుండి దోహా మీదుగా కొచ్చికి వచ్చారు. కొచ్చిలో కథకళి ప్రదర్శనకు హాజరయ్యారు. మరుసటి రోజు అలప్జుహాలో హౌస్‌బోట్ రైడ్ కోసం వెళ్లారు . ఫోర్ట్ కొచ్చి రిసార్ట్‌లో బస చేశారు. అదే సమయంలో ఇటాలియన్ టూరిస్ట్ తో సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది.

ఐసోలేషన్ వార్డ్ నుంచి తప్పించుకున్న దంపతులు

మరుసటి రోజు దగ్గు, జ్వరం లక్షణాలు ఉండడంతో కేరళకు చెందిన ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో వైద్యులు కరోనా సోకిందనే అనుమానంతో భార్యభర్తల్ని ఐసోలేషన్ వార్డ్ లో ఉంచినట్లు సమాచారం. ఫైనల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తుండగా..శుక్రవారం రాత్రి ఆస్పత్రి నుంచి తప్పించుకున్నారు. భార్యభర్తలు ఆస్పత్రి నుంచి తప్పించుకొని పారిపోవడంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో దంపతులు తిరిగిన టూరిస్ట్ ప్రాంతాల్ని ట్రేస్ చేసి వాటి ఆధారంగా వారు ఎక్కడికి వెళ్లారనే దానిపై పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేశారు.

కొచ్చి నుంచి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నం

అదే సమయంలో కేరళ నుంచి అమెరికా కు వెళ్లేందుకు దంపతులు కొచ్చి ఎయిర్ పోర్ట్ కు రావడం, అక్కడ ఐసోలేషన్ వార్డ్ లో చికిత్స చేయించుకున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం దంపతులు ఐసోలేషన్ వార్డ్ లో ఉన్నారని, ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారు.

 

Latest Updates