వందే భారత్‌ ఫ్లైట్లపై నిబంధనలు విధించిన యూఎస్‌

  • ఇక నుంచి 30 రోజుల ముందే పర్మిషన్‌ అప్లై చేయాలని ఆదేశాలు

న్యూఢిల్లీ: అమెరికాలో ఇరుక్కుపోయిన మనవాళ్లను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఎయిర్‌‌ ఇండియా నడుపుతున్న వందేభారత్‌ ఫ్లైట్లపై అమెరికా నిబంధనలు విధించింది. అమెరికా ప్రభుత్వం ఇలాంటి ఫ్లైట్లు నడపకుండా ఇండియన్‌ గవర్నమెంట్‌ నిషేధం విధించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకన్నామని అమెరికన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ చెప్పింది. ఇప్పటి నుంచి ఫ్లైట్లు నడపాలంటే కచ్చితంగా 30 రోజుల ముందే అప్లికేషన్‌ పెట్టుకోవాలని కొత్త నిబంధనలు ఇచ్చింది. మూడో విడత వందేభారత్‌ మిషన్‌ కింద అమెరికాలోని వివిధ ప్రదేశాల నుంచి ఇండియా ఈ నెల 12 నుంచి జులై 2 వరకు 96 ఫ్లైట్లను నడపుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు యూఎస్‌ ఇచ్చిన ఈ ఉత్తర్వుల వల్ల అవి నిడిచే అవకాశం కనిపించడం లేదు. కాగా. . ఈ విషయంపై ఇంకా మన ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. అమెరికాకు రావాల్సిన, అమెరికానుంచి వెళ్లాల్సిన ఎయిర్‌‌లైన్స్‌ సర్వీసులపై నిబంధనలు పెట్టి వ్యత్యాసాలు చూపుతోంది అని యూఎస్‌ ఆరోపించింది. విదేశాల్లో ఇరుక్కున్న మనవాళ్లను ఇళ్లకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Latest Updates