భార్యకు విడాకులు.. రూ.5కోట్లు గెలుచుకున్న భర్త

భార్య ప్రియుడిపై పరువు నష్టం దావావేసి ఓ భర్త రూ.5 కోట్లు గెలుచుకున్నాడు. ఇష్టపడి కష్టపడితే ఎవరైనా పైకొస్తారు..! కానీ ఈ భర్త కష్టపడే భార్యకు విడాకులిచ్చాడు. అదేంటీ కష్టపడితే పైకొస్తారు కానీ ఇలా విడాకులిస్తారా అనే అనుమానం రావొచ్చు. అమెరికాలోని నార్త్ కరోలీనా కు చెందిన కెవిన్ హావార్డ్ డీజేగా విధులు నిర్వహిస్తున్నాడు. స్వతగా కెవిన్ పనిరాక్షసుడు కావడంతో భార్య బాగోగులు పట్టించుకోవడం మానేశాడు. దీంతో స్థానికంగా ఉన్న ఓ టీవీ ఛానల్ లో విధులు నిర్వహిస్తున్న భార్య తన సహచర ఉద్యోగితో సహజీవనం చేయసాగింది.

ఈ నేపథ్యంలో భర్త కెవిన్ కు భార్యపై అనుమానం రావడంతో ఓ ప్రైవేట్ డిటెక్టీవ్ ఏజెన్సీని ఆశ్రయించాడు. భార్య పై అనుమానంగా ఉందని, ఆ అనుమాన్ని పటాపంచలు చేయాలని కోరాడు. రంగంలోకి దిగిన ఏజెన్సీ ప్రతినిధులు అతడు లేని సమయంలో భార్య సహుద్యోగితో సన్నిహితంగా ఉంటున్నట్లు.. ఇంటికి వచ్చి వెళుతున్నట్లు గుర్తించారు. మనోవేధనకు గురైన కెవిన్.. భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు తన వివాహ బంధం నాశనం అవ్వడానికి భార్య ప్రియుడే కారణమంటూ పరువునష్టం దావావేశాడు. కెవిన్ కేసుపై విచారణ చేపట్టిన వాషింగ్ టన్ కోర్ట్ నిందితుడికి రూ.5కోట్లు నష్టపరిహారం విధించింది. ఆ నష్టపరిహారాన్ని బాధితుడు కెవిన్ కు అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్ట్ ఉత్తర్వులతో ఆనందం వ్యక్తం చేసిన కెవిన్ భార్యకు విడాకులు ఇవ్వడం తనకు ఇష్టం లేదని, సహచర ఉద్యోగితో సహజీవనం చేయడాన్ని తప్పుబట్టాడు. పనిలోపడి భార్యను పట్టించుకోకపోవడంపై క్షమాపణలు కోరాడు.

Latest Updates