యూఎస్ ఓపెన్ విన్నర్ నాదల్

యూఎస్ ఓపెన్ ఫైనల్లో రఫెల్ నాదల్ రఫ్పాడించాడు. పురుషుల సింగిల్స్ లో రష్యన్  ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్ ను ఓడించి నాల్గోసారి  యుఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐదు సెట్ల మ్యాచ్ లో 7-5 6-3 5-7 4-6 6-4 తేడాతో మెద్వెదేవ్ ను ఒడించాడు. దీంతో తన కెరీర్‌లో 19వ గ్రాండ్ స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు నాదల్. పురుషుల సింగిల్స్ లో  20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన రోజర్ ఫెదరర్‌ రికార్డుకు నాదల్ ఒక అడుగు దూరంలో ఉన్నాడు. 

 

Latest Updates