కేరళ పసుపు ట్రీట్‌ మెంట్‌ కు అమెరికా పేటెంట్

కేన్సర్ వ్యాధికి కేరళ సైంటిస్టులు కనిపెట్టిన కొత్త రకం పసుపు ట్రీట్ మెంట్ కు అమెరికాలో పేటెంట్ లభించింది. కేన్సర్ వ్యాధి తిరగబెట్టకుండా పసుపుతో పూర్తిగా నిర్మూలించేందుకు ఈ కొత్త ట్రీట్ మెంట్ ను తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ సైంటిస్టులు కనుగొన్నారు. దీనికి యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ (యూఎస్ పీటీవో) నుంచి ఆమోదం లభించినట్లు ఇనిస్టిట్యూ ట్ హెడ్ లిస్సీ కృష్ణన్ వెల్లడించారు.

పసుపుతో ట్రీట్ మెంట్ ఇలా..

పసుపు యాంటీ బ్యాక్ టీరియల్ మెడిసిన్ గా పనిచేస్తది. శరీరంలో వాపు, మంటను తగ్గించే యాంటీ ఇన్ ఫ్లమేషన్ మందుగానూ పనికొస్తది. రక్తం గడ్డలను కరిగించే శక్తి దీనికుంటది. కేన్సర్ కణాలను నాశనం చేసే గొప్ప గుణం పసుపులోని కుర్ క్యుమిన్ అనే రసాయనానికి ఉందని శ్రీచిత్ర ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు చెప్తున్నారు. అయితే కుర్ క్యుమిన్ ను నేరుగా మందులా ఉపయోగించడం కుదరదని, అందుకే తాము దీనిని వాడేందుకు కొత్త టెక్ నాలజీని డెవలప్ చేశామని వారు వెల్లడించారు.

రీసెర్చ్ లో భాగంగా వీరు..రక్తంలోని ఫైబ్రిక్ క్లాట్స్ ను వేఫర్ మాదిరిగా ఉపయోగించుకుని, వాటిలో కుర్ క్యుమిన్ ను ప్రవేశపెట్టారు. ఆ వేఫర్స్ కేన్సర్ కణాల వద్దకు వెళ్లినప్పుడు వాటిలోని కుర్ క్యుమిన్ రిలీజ్ అయి కేన్సర్ కణాలను చంపేలా చేశారు. అదే సమయంలో హెల్తీ టిష్యూకు ఎలాంటి హాని కలగదనీ వీరి రీసెర్చ్ లో తేలింది. ఆపరేషన్ ద్వారా కేన్సర్ ట్యూమర్లను తొలగించిన తర్వాత కొన్ని కేన్సర్ కణాలు మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ కణాలే తిరిగి మళ్లీ ట్యూమర్లుగా పెరుగుతాయి. అందుకే.. ట్యూమర్లను తొలగించాక, మిగిలిపోయే కేన్సర్ కణాలను అన్నింటినీ నాశనం చేసేందుకు ఈ ట్రీట్ మెంట్ ఉపయోగపడుతుందని శ్రీచిత్ర ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు వెల్లడించారు. ఈ రీసెర్చ్ కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మె డికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిధులు సమకూర్చిందని, పూర్తిస్థాయిలో కేన్సర్ ట్రీట్ మెంట్ ను సిద్ధం చేసేందుకు ఈ టెక్ నాలజీని ట్రాన్స్ ఫర్ చేస్తామని తెలిపారు.

Latest Updates