మహీంద్రా సంస్థను ప్రశంసించిన అమెరికా

వాషింగ్టన్ : కరోనా పై పోరులో తనవంతు సహాయం అందిస్తున్న మహీంద్రా కంపెనీని అమెరికా ప్రశంసించింది. స్టేట్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ మైక్ పాంపియా ట్విట్టర్ వేదికగా మహీంద్రా గ్రూప్ ను అభినందించారు. కరోనా టైమ్ లో లైఫ్ సేవింగ్ ఎక్విప్ మెంట్ తయారు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో మాస్క్ లు, శానిటైజర్లు, వెంటిలేటర్లు ఇతర ఎక్విప్ మెంట్ కొరత లేకుండా ఉండేందుకు మహీంద్రా సంస్థ రంగంలోకి దిగింది. సంస్థకు చెందిన ఆటో మ్యానుఫాక్చరింగ్ యూనిట్లలో లైఫ్ సేవింగ్ ఎక్విప్ మెంట్ తయారు చేయటం ప్రారంభించింది. అమెరికాలోని ప్లాంట్లలోనూ ఫేస్ మాస్క్ లు, షీల్డ్స్ చేస్తోంది. ఈ విషయాన్ని అక్కడి లోకల్ మీడియా గుర్తించి కథనాలు రాసింది. వాటి ద్వారా మహీంద్రా సంస్థ సేవలను అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ మైక్ పాంపియో తెలుసుకొని సంస్థను అభినందించారు.

Latest Updates