మహాత్ముడికి నివాళి అర్పించి..మొక్కను నాటిన ట్రంప్ దంపతులు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీకి నివాళులర్పించారు. సమాధి వద్ద పుష్ప గుచ్ఛం పెట్టి కాసేపు మౌనం పాటించారు . అనంతరం ట్రంప్ అక్కడి విజిటర్ బుక్ లో సంతకం చేశారు.  ఈ సందర్భంగా భారత ప్రతినిధి ట్రంప్ కు గాంధీజీ జ్ఞాపికను అందించారు. అనంతరం రాజ్ ఘాట్ ఆవరణలో మొక్కను నాటారు.  తర్వాత  ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ కు బయల్దేరారు ట్రంప్ దంపతులు . అక్కడ ఇండియా-అమెరికా మధ్య ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి.

Latest Updates