ఢిల్లీకి చేరుకున్న ట్రంప్.. రేపటి షెడ్యూల్ ఇదే

యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు తాజ్ మహల్ సందర్శన ముగిసింది. ట్రంప్‌ దంపతులతో పాటు వారి కూతురు ఇవాంకా దంపతులు కూడా  తాజ్‌మహల్‌ను సందర్శించారు.భర్త కుష్నర్‌తో కలిసి ఇవాంక తాజ్‌మహల్‌ వద్ద ఫొటోలు దిగారు. తాజ్‌మహల్‌ అందాలను ఆస్వాదించారు. ఆ తర్వాత నుంచి వారు ఆగ్రా నుంచి ఢిల్లీ బయలుదేరారు. విమానాశ్రయం వద్ద ట్రంప్ దంపతులకు యూపీ గవర్నర్, సీఎం యోగి ఆదిత్యానాథ్ లు వారికి వీడ్కోలు పలికారు.

ట్రంప్ బృందం ఢిల్లీ చేరుకుంది. ఈ రాత్రి ఢిల్లీలోని  హోటల్ ITC మౌర్యలో ట్రంప్ కుటుంబం బస చేయనుంది. ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని రేపు అధికారక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.  మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటి, ఆ తర్వాత రాజ్ ఘాట్ లో గాంధీ మహాత్ముడికి నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నాం  ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనున్నారు ట్రంప్. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది.

Latest Updates