నవంబర్ 3 నాటికి యూఎస్ లో వ్యాక్సిన్: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా అంతానికి రోజులు దగ్గర పడుతున్నాయని… అమెరికా చేతిలో నవంబర్ 3 వరకు వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ ఉంటుందని తెలిపారు. దీంతో పాటు చైనా పైనా ఆరోపణలు చేశారు ట్రంప్. అమెరికా దగ్గర ఉన్న కరోనా వ్యాక్సిన్ సమాచారాన్ని చైనా దొంగిలించిందా? అన్న విషయాన్ని తాను చెప్పలేను కానీ, అది చైనాకు సాధ్యమయ్యేపనేనని మాత్రం నమ్ముతున్నానన్నారు. వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలు ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు.

మరోవైపు యూఎస్ లో ఈసారి ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా నవంబర్ 3నే జరుగుతాయి. ఈ క్రమంలో నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ యూఎస్ దగ్గర ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యర్థులు ఆరోపణలకు దిగారు.

Latest Updates