తాజ్ దగ్గర గంట సేపు

ఆగ్రా: ఆగ్రా చేరుకున్న ట్రంప్​ దంపతులకు యూపీ గవర్నర్​ ఆనందీ బెన్​ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం స్వాగతం చెప్పారు.వందలాది మంది కళాకారులు ఎయిర్​పోర్టులో యూపీ సంప్రదాయ నృత్యం ‘మయూర్​ డ్యాన్స్’తో వారికి వెల్కమ్​ చెప్పారు. సిటీ వీధుల్లో ‘ఇండియా బెస్ట్​ ఫ్రెండ్​కు ఆగ్రా సిటీ వెల్కమ్​ చెబుతోంది’ అంటూ భారీ బిల్​బోర్డులను యూపీ సర్కారు ఏర్పాటు చేసింది.ఎయిర్​పోర్ట్ ​నుంచి ఒబెరాయ్ ​అమర్​విల్లా హోటల్​ వరకు 13కిలోమీటర్ల మేర దాదాపు  3వేల మంది ఆర్టిస్టులు బ్రిజ్,అవధ్​డ్యాన్స్ లు చేశారు.ట్రంప్​ కాన్వాయ్​కి 15వేల మంది స్కూలు చిన్నారులు అమెరికా,ఇండియా జెండాలతో ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి ఉన్నతాధికారుల ట్రంప్​ కుటుంబాన్ని తాజ్​ మహల్​ సందర్శనకు తీసుకెళ్లారు. అక్కడ వారు సుమారు గంట పాటు గడిపారు. ఈ నేపథ్యంలో తాజ్‌మహల్‌ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రంప్​ టూర్​ నేపథ్యంలో సోమవారం తాజ్​మహల్​ వద్ద అధికారులు మూడంచెల సెక్యూరిటీ వలయాన్ని ఏర్పాటు చేశారు.విజిటర్స్ ను ఉదయం 11.30 గంటల వరకే  అనుమతించారు. మధ్యాహ్నం నుంచి ట్రంప్​ కోసం గట్టి సెక్యూరిటీని ఏర్పాటుచేశారు. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్​ మహల్​ ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఉంది. 2015లో అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ ఒబామా ఆగ్రా సందర్శించాలని అనుకున్నా..సెక్యూరిటీ కారణాల వల్ల టూర్​ రద్దు చేసుకున్నారు. 2000లో యూఎస్ ప్రెసిడెంట్​ బిల్​ క్లింటన్​ సందర్శించారు.

 

Latest Updates