చెడుపై మంచి విజయం: దీపావళి వేడుకల్లో ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక నివాసం వైట్ హౌస్ లో ఆదివారం దీపావళి వేడుకలు చేసుకున్నారు. భార్య మెలనియా, వైట్ హైస్ అధికారులతో కలిసి ఆయన దీపాలను వెలిగించారు. అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారాయన. దివ్వెల పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు ట్రంప్.

దీపావళి శుభాకాంక్షలు చెబుతూ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు ట్రంప్. అమెరికా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు ఈ పవిత్ర సమయం స్ఫూర్తిని నింపే రోజుకావలన్నారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై విజ్ఞానం సాధించిన విజయానికి ప్రతీక ఈ రోజు అని అన్నారు ట్రంప్. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఈ దివ్వెల పండుగ సంతోషంగా జరుపుకోవాలన్నారు. అమెరికా అంతటా దీపావళి వేడుకలు జరుపుకోవడం తమ దేశంలో అన్ని మతాల సామరస్యం, స్వేచ్ఛకు చిహ్నమని ట్రంప్ చెప్పారు. ఈ రకమైన హక్కులను కాపాడడంలో తన ప్రభుత్వం ముందుంటుందన్నారు.

Latest Updates