యూఎస్​లో ఒక్కరోజులో 2,494 మంది మృతి

వాషింగ్టన్: అమెరికాలో కరోనా మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన ఒక్కరోజులోనే యూఎస్ లో 2,500 మంది చనిపోయారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ రిపోర్టులో వెల్లడించింది. 24 గంటల్లో ఇంతమంది చనిపోవడం రికార్డు అని ప్రకటించింది. గడిచిన మూడు వారాల్లో 1500 మంది చనిపోగా.. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఒక్కరోజులోనే 2,494 మంది చనిపోయారని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో కరోనా మృతుల సంఖ్య 53,928 కు చేరుకుంది. పాజిటివ్ కేసుల సంఖ్య 9 లక్షల 56 వేలు దాటింది.

Latest Updates