యూఎస్‌లో ఒక్కరోజే 52వేల కేసులు

  • రికార్డు స్థాయిలో నమోదైన కేసులు

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగవంతంగా స్ప్రెడ్‌ అవుతోందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో యూఎస్‌లో ఒక్కరోజు 50వేల కేసులు నమోదయ్యాయి. ఇంత రికార్డు స్థాయిలో కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. దీంతో దేశంలోని రెస్టారెంట్లు, బార్‌‌లు, బీచ్‌లు మూసేశారు. యూరోపియన్‌, బ్రెజిల్‌, రష్యా దేశాలక సరిహద్దులు ఓపెన్‌ చేయడంతో ఈ కేసులు పెరిగిపోయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో నిషేధాజ్ఞలు విధించారు. వీకెండ్‌ పార్టీల్లో పాల్గొన్న వారిని 14 రోజుల పాటు నిర్బంధాన్ని విధించాయి. కాలిఫోర్నియా లాస్‌ఏంజిల్స్‌, అనేక కౌంటీలలోని రెస్టారెంట్లలో కస్టమర్లను లోపలికి అనుమతించడం లేదు.

Latest Updates