FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) ప్రారంభానికి ముందే సరికొత్త వివాదం చెలరేగింది. టోర్నమెంట్లో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్న కొన్ని దేశాల ఆటగాళ్లకు విమానాశ్రయాల్లో ఎదురైన చేదు అనుభవాలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సెనెగల్ (Senegal), ఉజ్బెకిస్తాన్ (Uzbekistan) ప్లేయర్స్ ని యూఎస్ సెక్యూరిటీ సిబ్బంది అత్యంత అవమానకరంగా తనిఖీ చేశారనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.
నేరస్థుల్లా చూశారంటూ ఫ్యాన్స్ ఫైర్:
ట్విట్టర్ (X), ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలలో ఫుట్బాల్ అభిమానులు అమెరికా భద్రతా విభాగాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సెనెగల్ ప్లేయర్స్ ను ఎయిర్పోర్ట్లో గంటల తరబడి నిలిపివేసి, నేరస్థుల్లా చూశారు.. ప్రపంచకప్ అనేది దేశాల మధ్య ఐక్యతను చాటడానికి.. కానీ అమెరికా మాత్రం ఆటగాళ్లను తీవ్రవాదుల్లా చూస్తోంది. అన్ని దేశాలకూ ఒకే రకమైన నిబంధనలు వర్తించవా? అని నెటిజన్లు ప్రశ్నించారు.
భద్రతా ప్రోటోకాల్స్ VS వివక్ష:
ఈ వివాదంపై ఫిఫా (FIFA) మేనేజ్మేంట్ గానీ, ఆతిథ్య దేశమైన అమెరికా గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ, టోర్నమెంట్ నిర్వాహకులకు సన్నిహితంగా ఉండే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ తనిఖీలు కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాలేదని, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాల (Standardized Protocols) ప్రకారమే అందరికీ స్క్రీనింగ్ జరిగిందని అంటున్నారు. అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్కు భద్రత అత్యంత కీలకం కాబట్టి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, కొందరు ప్లేయర్స్ ని మాత్రమే టార్గెట్ చేసినట్లుగా వీడియోలు తీశారని వెల్లడించారు.
ALSO READ : రుతురాజ్ క్లాస్ సెంచరీ.. తిలక్ వర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్..
ఫిఫాపై ఒత్తిడి.. పారదర్శకతకు డిమాండ్:
ఫుట్బాల్ క్రీడ ప్రతిష్టని దెబ్బతీసేలా ఉన్న ఇలాంటి ఘటనలపై ఫిఫా తక్షణమే స్పందించి స్పష్టత ఇవ్వాలని క్రీడా విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. ఆటగాళ్ల పట్ల వివక్ష చూపకుండా, అన్ని దేశాల జట్లను సమానంగా గౌరవించాలని నెటిజన్లు కోరుతున్నారు. వరల్డ్ కప్ మ్యాచ్లు ప్రారంభం కాకముందే ఈ స్థాయి వివాదం రేగడం టోర్నమెంట్ నిర్వహణపై కాస్త నీలి నీడలు కమ్ముకునేలా చేసింది.
🇸🇳🇺🇸 Les senegalais traités comme des terroristes à leur arrivée aux Etats-Unis
— Jaf (@Jafkech) June 8, 2026
Aucune reaction cela dit devant l'Homme blanc.
Une docilité qui contraste avec avec leurs pleurnicheries incessantes pendant la CAN au Maroc 🇲🇦 pic.twitter.com/jf2H0TuayW
