నాటో మిత్రదేశంగా ఇండియా

  •   అమెరికా సెనేట్ ఆమోదం

ఇండియాకు నాటో మిత్ర దేశం హోదా ఇచ్చే చట్ట సవరణ బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. హిందూ మహాసముద్రంలో ఇండియా, అమెరికాల మధ్య రక్షణ సహకారం, టెర్రరిజంపై పోరు, తీర ప్రాంతాల్లో సెక్యూరిటీ వంటి అంశాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి. సెనేట్ గత వారమే నేషనల్ డిఫెన్స్ అథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ) ను పాస్ చేసింది. సెనేటర్ జాన్ కార్నిన్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా, మార్క్ వార్నర్ మద్దతు తెలిపారు. త్వరలో దీన్ని హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ లో ప్రవేశపెట్టనున్నారు. ఇండియా, యూఎస్ మధ్య  స్నేహాన్ని ఇది మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన సెనేటర్లు కార్నిన్, వార్నర్ లను హిందూ అమెరికన్ ఫౌండేషన్ మెచ్చుకుంది. 2016లో ఇండియాను ముఖ్యమైన డిఫెన్స్  పార్టనర్ గా అమెరికా గుర్తించింది. దీంతో అమెరికా నుంచి ఆయుధాలు, మోడర్న్ టెక్నాలజీని కొనుగోలు చేసే అవకాశం ఇండియాకు దక్కింది.

Latest Updates