బ్రెజిల్ కు హైడ్రాక్సీక్లోరోక్విన్ డోసులు పంపిన యూఎస్

వాషింగ్టన్: కరోనా ట్రీట్ మెంట్ కోసం బ్రెజిల్ కు 2 మిలియన్ డోసుల మలేరియా డ్రగ్ ను పంపినట్లు అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. లాటిన్ అమెరికా దేశాల్లో కరోనా దెబ్బకు అత్యంత ప్రభావితమైన కంట్రీగా బ్రెజిల్ ను చెప్పొచ్చు. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రెజిలియన్ గవర్నమెంట్, వైట్ హౌస్ తో కలసి ఓ జాయింట్ స్టేట్ మెంట్ విడుదల చేసింది. వైరస్ తో బాధపడుతున్న వారితో పాటు మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ రక్షణ కోసం అమెరికా నుంచి బ్రెజిల్ కు హైడ్రాక్సీక్లోరోక్విన్ డోసులను పంపుతున్నట్లు ఇరు దేశాలు ప్రకటనలో పేర్కొన్నాయి. వీటితోపాటు బ్రెజిల్ కు 1,000 వెంటిలేటర్స్ ను కూడా పంపుతున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. కరోనా ట్రీట్ మెంట్ లో ఈ డ్రగ్ బాగా ఉపయోగపడుతుందని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. వైరస్ చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ సురక్షితమా కాదా అనే విషయంతోపాటు అది ఎంత ప్రభావవంతంగా పని చేస్తుందనే దాని గురించి ఎలాంటి సైంటిఫిక్ స్టడీస్ చెప్పకపోవడం గమనార్హం.

Latest Updates