భారత్ ఎయిర్ స్ట్రైక్ ని ఖండించలేదేం: అమెరికాపై పాక్ ఏడుపు

  • ఇండియాను యూఎస్ మరింత ప్రోత్సాహిస్తోంది
  • వాషింగ్టన్ లో మీడియాతో పాక్ రాయబారి అసద్

వాషింగ్టన్: ఉగ్రవాదులకు నిధులు ఇస్తూ, దాడులకు రెచ్చగొడుతున్న పాక్ ప్రపంచంలో ఏకాకిగా మారింది. పుల్వామా దాడిలో 40 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే మహమ్మద్ సంస్థ పాక్ మెడకి ఉచ్చులా బిగుస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించొద్దంటూ ప్రపంచమంతా హెచ్చరించింది. అన్ని దేశాలూ భారత్ కు అండగా నిలిచాయి.

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్ చేసి పాకిస్థాన్ లోని జైషే టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది. ఆ తర్వాత కూడా ప్రపంచ దేశాలన్నీ పాక్ కే వార్నింగ్ లు ఇచ్చాయి. ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాలని సూచించాయి. అయితే ఉద్రిక్తతలు తగ్గించాలని భారత్, పాక్ కు సూచించాయి.

అమెరికా మద్దతు మనకే

పాకిస్థాన్ కు ప్రపంచంలో ఏ ఒక్క దేశం నుంచీ సపోర్ట్ రాకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ చేసిన ఎయిర్ స్ట్రైక్ ని కూడా ఏ దేశమూ ఖండించలేదు. కారణం భారత్ కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసింది. పాక్ పౌరులను కానీ, సేనలను కానీ టార్గెట్ చేయలేదు. దీంతో ఇప్పుడు అమెరికాపై పాక్ ఏడుపు మొదలుపెట్టింది. నిన్నటి దాకా ఉగ్రవాదంపై పోరాడడానికంటూ పాక్ కు నిధులిచ్చిన అగ్రదేశం ప్రస్తుతం భారత్ కి మద్దతు తెలపడంపై ఉడికిపోతోంది పాక్.

పాక్ పైకి మీరే పంపుతున్నట్టుంది

భారత్ చేసిన ఎయిర్ స్ట్రైక్ ను అమెరికా ఖండించలేదేమంటూ అమెరికాలో పాక్ రాయబారిగా ఉన్న అసద్ మజీద్ ఖాన్ ప్రశ్నించారు. భారత్ చేసిన పనికి అమెరికా మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ‘భారత్ ను మీరే పాక్ పైకి ప్రోత్సాహిస్తున్నట్టుగా ఉంది’ అని భేలగా మాట్లాడారు. వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎయిర్ స్ట్రైక్ సరైన పని అన్న యూఎస్.. ఈ లింక్ పై క్లిక్ చేయండి

Latest Updates