ఇండియాకు 100 వెంటిలేటర్లు పంపుతున్న‌ అమెరికా

వాషింగ్టన్: కరోనా పేషెంట్లకు ట్రీట్​మెంట్ అందించేందుకు వచ్చే వారంలో 100 వెంటిలేటర్లను ఇండియాకు తరలించనున్నట్లు అమెరికా వెల్లడించింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్​లో మాట్లాడారని వైట్​హౌస్ తెలిపింది. జీ–7 సమ్మిట్, కరోనా రెస్పాన్స్, రీజనల్ సెక్యూరిటీ అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారని చెప్పింది. ‘‘మొదటి విడతలో 100 వెంటిలేటర్లను పంపేందుకు అమెరికా రెడీగా ఉంది. వచ్చే వారంలో ఇండియాకు పంపుతాం. ఈ విషయంలో ప్రెసిడెంట్ హ్యాపీగా ఉన్నారు” అని తెలిపింది. ఇండియాకు విరాళంగా ఇస్తామన్న వాటిలో కొన్నింటిని ఈ మేరకు పంపుతామని పేర్కొంది.

Latest Updates