శ్రీలంక వెళ్లేముందు ఆలోచించండి:పౌరులకు అమెరికా విజ్ఞప్తి

శ్రీలంకలో మరిన్ని దాడులు జరగొచ్చు

ఎవరూ వెళ్లొద్దు… వీలైతే.. వచ్చేయండి

అమెరికా హెచ్చరిక

వాషింగ్టన్ : శ్రీలంకలో పర్యటించాలనుకుంటున్నారా .. ఐతే ఒక్కసారి ఆలోచించుకోండి అని తమ దేశ పౌరులను కోరుతోంది అగ్రదేశం అమెరికా. శ్రీలంకలో క్రిస్టియన్లు, ఫారినర్లే టార్గెట్ గా ఉగ్రవాదులు అత్యంత దారుణమైన మారణకాండ జరపడం అమెరికాను ఆలోచనలో పడేసింది. తమ దేశంలో 8 వరుస బాంబు పేలుళ్లలో 253 మంది చనిపోయినట్టు శ్రీలంక అధికారికంగా ప్రకటించింది. వీరంతా క్రిస్టియన్లు, ఫారినర్లే కావడంతో… తమను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని మరిన్ని దాడులకు పాల్పడే సూచనలు ఉన్నట్టుగా అమెరికా భావిస్తోంది.

శ్రీలంకలో ప్రస్తుతం సురక్షిత పరిస్థితులు లేవని… ఆదేశంలో పౌరుల భద్రత గందరగోళంలో పడిందని అమెరికా అభిప్రాయపడుతోంది. శ్రీలంకలో ఫారినర్లే లక్ష్యంగా మరిన్ని దాడులు జరగొచ్చని హెచ్చరిస్తోంది. అక్కడికి వెళ్లేవారికి కూడా థ్రెట్ ఉందని చెబుతోంది. అందుకే… శ్రీలంకలో పర్యటనలు కొంతకాలం పాటు మానుకుంటే మంచిదని సూచిస్తోంది.

మరోవైపు.. శ్రీలంకలో ఎమర్జెన్సీ కొనసాగుతోంది. భధ్రతపై ఆ దేశం అత్యున్నత స్థాయిలో రివ్యూ జరుపుతోంది.

Latest Updates