యోగా సెంటర్‌లో మద్యం తాగించి.. అమెరికా యువతిపై రేప్

అమెరికా నుంచి యోగా నేర్చుకునేందుకు వచ్చిన మహిళతో మద్యం తాగించి.. అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఈ ఘటన జరిగింది. అమెరికా యువతి ఫిర్యాదుతో నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు తెలిపారు పోలీసులు.

అమెరికాకు చెందిన యువతి (33) యోగా శిక్షణ తీసుకునేందుకు రిషికేష్‌లోని తపోవన్ ఏరియాలో ఉన్న రిషికేష్‌నాథ్ యోగాశాలలో నెల రోజుల క్రితం చేరింది. ఆమెతో అక్కడ పరిచయం పెంచుకున్న గీతాన్ష్ అనే 26 ఏళ్ల యువకుడు మంగళవారం నాడు ఆల్కహాల్ తాగుదామని తన రూమ్‌కు తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగిన తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు గీతాన్ష్. స్థానిక ముని కిరీటి పోలీస్ స్టేషన్‌లో అమెరికా మహిళ ఆ యువకుడిపై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి ఆమెను వైద్య పరీక్షలకు పంపినట్లు చెప్పారు పోలీసులు. దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటికే నిందితుడు గీతాన్ష్‌ను అరెస్టు చేశామని తెలిపారు.

More News:

తప్పు చేసుంటే నా కళ్లలో యాసిడ్‌ పోయండి: రేప్ కేసులో తానే వాదించుకున్న దోషి

ఆల్కహాల్‌తో కరోనాకు చెక్: అమెరికా హాస్పిటల్ పేరుతో ప్రచారం.. నిజమా?

బీరు దొంగిలించిన దంపతుల అరెస్ట్.. పట్టించిన సీసీ కెమెరా

Latest Updates