కోచ్ చెబితే పరిగెత్తడానికి రెడీ: ఉసేన్ బోల్ట్

జమైకా: స్పోర్ట్స్ వరల్డ్‌లో జమైకన్ చిరుత, స్ప్రింట్ కింగ్ లాంటి పదాలు ఎవరిని ఉద్దేశించి వాడతారో తెలియని వారుండరు. ప్రపంచ 100, 200 మీటర్స్‌ రన్నింగ్‌ రేసుల్లో రికార్డు హోల్డర్ అయిన ఆ ప్లేయరే ఉసేన్ బోల్ట్‌. అయితే చాలా రికార్డును తన ఖాతాలో వేసుకున్న బోల్ట్‌ పరుగుకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. పలు మేగజీన్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా స్ప్రింటింగ్‌ కెరీర్‌‌ వైపు మళ్లీ వచ్చే చాన్స్ లేదని ఈ ఒలింపిక్ చాంపియన్ పేర్కొన్నాడు. అయితే తాజాగా రిటైర్‌‌మెంట్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు.

‘ఒకవేళ నా కోచ్ గ్లెన్ మిల్స్ వచ్చి నన్ను మళ్లీ పరిగెత్తమని చెబితే మాత్రం నేను రెడీ. ఎందుకంటే నేను నా కోచ్‌ను అంతగా నమ్ముతా. ఆయన మనం చేద్దామని చెబితే అది సాధ్యమవుతుందని తెలుసు. ఆయన పిలిస్తే రావడానికి నేను రెడీ. నేను ట్రాక్ పైకి వచ్చినప్పుడు నా కోచ్ కూడా చాలా ఉత్సుకతతో ఉంటారు. అందుకే నేను దూరంగా ఉంటున్నా. రికార్డులు బ్రేక్ చేయడం కంటే మంచి తండ్రిగా ఉండటం కష్టం’ అని బోల్ట్ వివరించాడు.

Latest Updates