హెల్మెట్​ కొంటున్నరా? అయితే ఇవి తెలుసుకోండి

హెల్మెట్​ పెట్టుకుంటే ఇంకేం అడగమని ట్రాఫిక్​ పోలీసోళ్లు చెప్పడంతో జనమంతా హెల్మెట్లు కొనేందుకు ఎగబడుతున్నరు. అయితే హెల్మెట్​ కొనేముందు ఒక్కసారి ఇది చదువున్రి..

  • మనదేశం మొత్తంమీద 219 ​ కంపెనీలు హెల్మెట్లు తయారుచేసి అమ్ముతున్నయ్​. అందులో తొమ్మిది కంపెనీలే ‘బ్యూరో ఆఫ్​ ఇండియన్​ స్టాండర్డ్స్​’ చెప్పినట్లుగా తయారు చేస్తున్నయట. ఆ కంపెనీల హెల్మెట్లు మాత్రమే కొనడం మంచిది.
  •  ఐఎస్​ఐ గుర్తు ఉన్న హెల్మెట్లను కొనాలని పోలీసోళ్లు చెప్తున్నరు. అయితే రోడ్ల పక్కన అమ్మే హెల్మెట్లకు కూడా ఐఎస్​ఐ గుర్తు వేస్తున్నరు. నిజానికి . స్టడ్స్, రాంగ్లర్, టీహెచ్‌‌హెచ్, రాయల్ ఎన్ ఫీల్డ్, వెగా, స్టీల్ బర్డ్, ఎల్ ఎస్ -2 కంపెనీల హెల్మెట్లకు మాత్రమే ఐఎస్​ఐ  గుర్తు వేసుకునే అనుమతి ఉంది. ఇవి మాత్రమే కొనుక్కుంటే మంచిది.
  • ఒరిజినల్​ ఐఎస్​ఐ గుర్తు ఉన్న హెల్మెట్ల ధర కొంచెం ఎక్కువనే ఉంటది. కొనాలని డిసైడ్ అయిన తర్వాత అన్నిరకాలుగా మంచిగ ఉన్నది కొంటెనే బెస్ట్​. ఎందుకంటే అనుకోకుండా టైం బాగలేక యాక్సిడెంట్​ జరిగినా మన తల సేఫ్​గా ఉంటది. రోడ్ల పక్కన దొరికే హెల్మెట్లు కేవలం ‘చలానా’ల నుంచి మాత్రమే కాపాడతయ్​. ప్రమాదాల నుంచి కాపాడలేవనే విషయం గుర్తుంచుకోవాలి.

Latest Updates