తాటి ముంజల్లో ఉండే పోషక విలువలు

ఎండా కాలంలో మాత్రమే దొరికే తాటి ముంజలు రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయి. మండే ఎండలో తాజా ముంజల్ని తింటే ఆ మజానే వేరు. పైగా వీటిల్లో ఉండే పోషక విలువలు శరీరానికి ఎంతో ఉపకరిస్తాయి. అందుకే ప్రకృతి ప్రసాదించిన వేసవి వరంగా తాటి ముంజల్ని అభివర్ణిస్తుంటారు. ఇదివరకు రోజుల్లో ఊర్లకే పరిమితమైన ముంజలు.. తర్వాతి రోజుల్లో అంతటా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆన్ లైన్లోనూ తాటి ముంజల అమ్మకాల్ని చూడొచ్చు.

తాటి ముంజలు..

టాడీ పామ్‌ ఫ్రూట్‌.. ఐస్‌ యాపిల్‌. ముంజను తొలవగానే మధ్యలో కొంత నీరు ఉంటుంది. మండు వేసవిలో ఈ సీజనల్‌ ఫ్రూట్‌ ని తింటే వేసవి తాపానికి చెక్ పెట్టవచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సహజ సిద్ధమైన ముంజలతో ఆరోగ్యానికి ఎంతో మేలు. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు తాటి ముంజలు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం.. ఒక్క తాటి ముంజలోఉంటుంది. దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. అంతేకాదు శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి చల్లదనాన్ని అందిస్తుంది. అదే విధంగా జీర్ణక్రియ బాగా జరుగుతుంది. పామ్‌ ఫ్రూట్‌ వల్ల కలిగే మరికొన్ని హెల్త్‌ బెనిఫిట్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.

పొటాషియం, శరీర బరువును అదుపులో ఉంచుతాయి. శరీరంలోని మలినాలను (టాక్సిన్స్) బయటకు పంపించి వేస్తాయి. పామ్‌ ఫ్రూట్స్‌ లో విటమిన్‌‌–బి, ఐరన్‌‌, క్యాల్ షియం పుష్కలంగా ఉంటాయి. రక్తప్రసరణ సక్రమంగా సాగేందుకు సహకరిస్తాయి. బీపీని అదుపులో ఉంచి కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తాయి. ఎముకలను బలంగా ఉంచుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. కడుపుఉబ్బరం, గ్యాస్‌ సమస్యలను నివారించడంలో నేచురల్‌ ట్రీట్‌ మెంట్‌ గా  పనిచేస్తాయి బరువు తగ్గాలనుకుంటే తాటి ముంజలు  ఉత్తమ మార్గం. ఎందుకంటే నీటిశాతం ఎక్కువగా ఉండే ముంజల్ని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఆకలి త్వరగా కాదు. వాంతులు వస్తుంటే ముంజలు తీసుకుంటే ఆ ఫీలింగ్ తగ్గుతుంది. చికెన్ ఫాక్స్ తో బాధపడేవారు తాటిముంజలు తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. జింక్‌‌ శాతం కూడా వీటిలో ఎక్కువే ఉంటుంది. ఇది శృంగార సమస్యలను దూరం చేధిస్తాయి. శృంగారసామర్థ్యాన్ని పెంచుతాయి.

కూలింగ్‌ ఫ్రూట్స్‌

సమ్మర్‌ లో డీహైడ్రేషన్ సమస్య సాధారణం. ఇతర సీజన్ల కంటే ఈ సీజన్‌‌లో ఎక్కువ అలసటకు గురవుతుంటారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు తాటి ముంజలు బెస్ట్‌‌ ఆప్షన్‌‌. వీటిని తింటే డీహైడ్రేషన్‌‌ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. వృద్ధులు, పిల్లలు చురుకుగా ఉండేందుకు తాటి ముంజలు తప్పక తినాలి.

ఎవరైనా తినొచ్చు 

తాటిముంజలను గర్భిణిలు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు. ఇవి వాళ్లలో జీర్ణక్రియను  రుగుపరుస్తుంది. మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఎసిడిటి సమస్యలను దరిచేయనియ్యదు. అదే విధంగా తాటిముంజల్లో క్యాన్సర్‌ ను అడ్డుకునే గుణాలు ఉన్నాయి. ఫైటో కెమికల్స్, ఆంతోసైనిన్… శరీరంలో ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ను పెరగకుండా నిరోధిస్తాయి. షుగర్‌, హార్ట్‌‌, ఒబెసిటీ పేషెంట్లు సైతం ముంజలను లాగించొచ్చు. తాటి ముంజల్లో క్యాలరీలు తక్కువ ఉన్నప్పటికీ ఫుల్‌ ఎనర్జీ అందిస్తాయి. ఒక మనిషి ఒకేసారి దాదా పు 20 తాటి ముంజలు కూడా తినవచ్చని వైద్యులు చెబుతున్నా రు. ఒకవేళ అజీర్తిగా అనిపిస్తే పచ్చి మామిడి ముక్కను తింటే సులువుగా జీర్ణమవుతుంది.

Latest Updates