తగినంత వాటర్ తీసుకోకపోతే.?

శరీరానికి నీరు ఎంతో అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరంలో జరిగే ప్రతీ క్రియకు నీరు అవసరం.నీరు లేనిది ఎటువంటి జీర్ణక్రియ జరగదు. నీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కల్గుతాయో ఒకసారి తెలుసుకుందాం.

  • నీరు శరీరంలోని మలినాలను మూత్ర రూపంలో బయటకు పంపిస్తుంది. తగినంత నీరు తీసుకోకపోతే కిడ్నీ స్టోన్స్, ఇన్ఫెక్షన్ వస్తుంది.
  • చాలా సేపు వాటర్ తీసుకోకపోతే ఆలోచన శక్తి తగ్గుతుంది.
  • నీరు తక్కువగా తీసుకోవడం వల్ల చెమట వచ్చినప్పుడు సోడియం,పోటాషియం వంట ి ఖనిజలవణాలు బయటకు వెళ్లిపోతాయి. దీని వల్ల డీహైడ్రేషన్ వస్తుంది.
  • ప్రతిరోజూ ఉదయం ముఖం కడిగిన వెంటనే ఒక గ్లాసు మంచినీరు తాగితే, మలబద్దకం సమస్య తగ్గిపోవటమేకాకుండా జీర్ణకోశపు వ్యాధులు రాకుండా ఉంటాయి.
  • తగినంత నీరు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో నీరు తగ్గినప్పుడు రక్తం తగ్గుతుంది. దీంతో రక్తనాళాల పనితీరు తగ్గి  గుండె వేగం పెరుగుతుంది
  • ప్రతి రోజు దాాదాపు 2-3 లీటర్ల వరకు నీరు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

Latest Updates