ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ను వాడుకుంటున్నాం: ఇమ్రాన్ ఖాన్

కరోనా అనుమానితుల ట్రేసింగ్ కోసం..
ఇస్లామాబాద్: టెర్రరిస్టుల జాడ తెలుసుకునేందుకు తమ గూఢచార ఏజెన్సీలు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) డెవలప్ చేసిన ట్రేసింగ్ సిస్టమ్ ను కరోనా అనుమానితులను గుర్తించేందుకు ఉపయోగించుకుంటున్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. వాస్తవానికి ఈ సిస్టమ్ ను టెర్రిరిస్టులను ట్రేస్ చేయడానికి డెవలప్ చేశారని, కానీ కరోనాను ఎదుర్కొనేందుకు వాడాల్సి వస్తోందని ఇమ్రాన్ చెప్పారు. ట్రాకింగ్, టెస్టింగ్, క్వారంటైన్ (టీటీక్యూ) ద్వారా మాత్రమే తమ దేశంలో వ్యాపారాలను తిరిగి ప్రారంభించడం సాధ్యమన్నారు. టీటీక్యూ పద్ధతిలో కాంటాక్ట్స్ ను వేగవంతంగా టెస్టింగ్స్, ట్రేసింగ్ చేస్తామని, పాజిటివ్ గా తేలిన వారిని ఎఫెక్టివ్ గా క్వారంటైన్ లో ఉంచుతామన్నారు. టెక్నాలజీ సాయంతో డేటాను కలెక్ట్ చేసి వాటిని మానిటర్ చేయడం ద్వారా కరోనా సంక్షోభాన్ని దాటేందుకు యత్నిస్తున్నామని పేర్కొన్నారు. దాయాది దేశంలో కరోనా కేసుల సంఖ్య 10,927కు చేరింది. వారిలో 230 మంది చనిపోయారు.

Latest Updates