జగ్గారెడ్డికి ఉత్తమ్ క్లాస్!

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ తొలి రోజైన గురువారం కాంగ్రెస్ సభ్యులు నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేయగా.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం నిరసనకు దూరంగా ఉన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కోరినట్టు తెలిసింది. పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండటం ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే పార్టీపై తనకు ఎలాంటి వ్యతిరేకతా లేదని, కానీ ఆ నిరసన విషయంలో తాను దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని జగ్గారెడ్డి పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి పార్టీ కార్యక్రమాలు, నిరసనల్లో పాల్గొంటానని జగ్గారెడ్డి శుక్రవారం వెల్లడించారు.

Latest Updates