కాంగ్రెస్ కు ప్రజాసేవే లక్ష్యం: ఉత్తమ్ కుమార్

మతం పేరుతో  దేశాన్ని విచిన్నం చేసి బీజేపీ పరిపాలన సాగిస్తోందని అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నందున ఎక్కువ సీట్లు గెలిచి ఢిల్లీకి కానుకగా ఇవ్వాలని చెప్పారు. ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ లకు మధ్యే పోటీ ఉందని అన్నారు. దేశం మొత్తం రాహుల్ ను ప్రధాని చేయాలని ఎదురుచూస్తుందని చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలలో మతాన్ని జోడిస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ల చరిత్ర ఉందన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గెలుపులు ఓటములు కాంగ్రెస్ కు కొత్త కాదని.. ఎన్నో సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజా సేవ తప్ప రాజకీయ ప్రయోజనం ఆశించదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచి రాహుల్ గాంధీ ని ప్రధాని చేయాలని అన్నారు.

Latest Updates