హుజూర్ నగర్ ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు పెరిగాయి

హుజూర్ నగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు పెరిగాయని అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన… ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ నాయకులు ఆక్రమిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ రైతులను ఓట్లకోసమే ఉపయోగించుకున్నాడని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇంతవరకు ఇవ్వలేదని, రైతుబంధు సమయానికి రాకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతుల ట్రాక్టర్లకు గతoలో ఉండే విదంగా సబ్సిడీ ని విడుదల చేయాలని ఆయన అన్నారు.  టీఆర్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని 2023లో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు.

Latest Updates