దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, చ‌రిత్ర సృష్టిస్తుంది

దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బై ఎలక్షన్ పై గురువారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మనిక్కం ఠాగూర్ తో టెలీ కాన్ఫరెన్స్ జరిగింద‌ని, శుక్ర‌వారం లేదా శ‌నివారం నాడు పోటీ చేయ‌బోయే అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తులపై సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామ‌ని, సబ్ కమిటీ నిర్ణయించిన మేరకు పొత్తులు ఉంటాయని చెప్పారు ఉత్త‌మ్. ప్ర‌తీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చనందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్ కు నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు బుద్ధి చెప్పాలన్నారు

జిహెచ్ఎంసి, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది పెద్ద మనుషులు నవంబర్ రెండో వారంలో ఎన్నికలు వస్తాయని అంటున్నారని, కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.

Latest Updates