ప్రాజెక్టులు కట్టేది నీళ్ల కోసం కాదు..కేసీఆర్ జేబులు నింపడానికి

సర్కార్ నిర్వాకంతోనే కల్వకుర్తి ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యిందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సర్కార్ కట్టే ప్రాజెక్టులన్నీ… నీళ్ల కోసం కాదు… కేసీఆర్ జేబులు నింపుకోవటానికే అన్నారు. ఇంజినీర్లు చెప్పినా సర్కార్ పట్టించుకోలేదన్నారు. అండర్ గ్రౌండ్ టన్నెల్ పెడితే కల్వకుర్తికి ప్రమాదమని 2016 జూన్ 22న ఎక్స్ పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకుండా పాలమూరు ప్రాజెక్ట్ కు అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ నిర్మాణం చేపట్టారన్నారు. ప్రభుత్వ తీరుతో కల్వకుర్తి హౌజ్ ధ్వంసమైందన్నారు. దీనిపై జుడిషియరీ ఎంక్వైరీ వేసి విచారణ చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.

కల్వకుర్తి పంప్ హౌస్ ను చూసేందుకు వెళ్ళిన  కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతిపక్ష నేతలు పరిశీలించడానికి పోతే అంత భయమెందుకని ప్రశ్నించారు. పోలీసులతో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ నేతల అరెస్టులను ఖండిస్తున్నామన్నారు.

భారీ ఆఫర్లు..అమెజాన్, ప్లిప్ కార్ట్ లకు కేంద్రం నోటీసులు

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..7 మంది మృతి

 

Latest Updates