లోక్ సభ ఎన్నికలకు సీరియస్ గా పనిచేయాలి : ఉత్తమ్

బూత్ లెవల్ ఏజెంట్ల విషయంలో సీరియస్ గా పనిచేయాలని పార్టీ లీడర్లకు సూచించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓటర్ల నమోదు, తొలగింపుపై ఓ నజర్ వేయాలన్నారు. ఉత్తమ్ అధ్యక్షతన గచ్చిబౌలిలోని ఓ హోటల్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కుంతియా, పార్టీ నేతలు హాజరయ్యారు. గతంతో పోల్చితే కాంగ్రెస్ కు ఓట్ల శాతం పెరిగిందన్నారు ఉత్తమ్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా మారారని చెప్పారు. నేతలు రాబోయే  పార్లమెంట్ ఎన్నికలలను సీరియస్ గా తీసుకుని పనిచేయాలన్నారు ఉత్తమ్.

Latest Updates