కొత్త PRC ప్రకటించాలని సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ బహిరంగ లేఖ

కొత్త PRC ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో 4లక్షల ఉపాధ్యాయ, ఉద్యోగులకు.. 3లక్షల మంది పెన్షనర్లకు వర్తించే.. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధనలో, సకల జనుల సమ్మెలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్నారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. జులై 1 2018 నుంచి రావాల్సిన 11వ పీఆర్సీ.. 20నెలలు గడుస్తున్నా ఎందుకివ్వడం లేదని, కమిటీ కాల పరిమితి ఎందుకు పొడిగించారని లేఖలో ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థికంగా నెంబర్ వన్ అంటూ  ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం లేదన్నారు ఉత్తమ్. కనీసం ఉద్యోగులకు మధ్యంతర భృతి అయినా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Latest Updates