పౌరసత్వ చట్టం.. నిరసన పేరుతో ఆస్తుల ద్వంసం: యూపీ డీజీపీ

20బైక్ లు, 10కార్లు, 3బస్సులు, 4మీడియా వ్యాన్ లను ద్వంసం
55మందిన అరెస్ట్.. సీసీటీవీ ఫుటేజ్ లు ఉన్నాయ్.. ఎవరినీ వదలం: యూపీ డీజీపీ


ఉత్తర ప్రదేశ్: పౌరసత్వ చట్టంపై నిరసన పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ద్వంసానికి దిగుతున్నారని అన్నారు ఉత్తర ప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్. నిరసన కారులు శాంతియుతంగా తమ నిరసనను తెలుపకుండా ఆస్తుల ద్వంసానికి దిగారని చెప్పారు. ఇప్పటివరకు 20బైక్ లు, 10కార్లు, 3బస్సులు, 4మీడియా వ్యాన్ లను నిరసనకారులు కాలబెట్టినట్టు డీజీపీ తెలిపారు. ఆస్తుల ద్వంసానికి పాల్పడిన వారిని తాము పట్టుకున్నామని చెప్పారు. ఇప్పటికరకు హింసకు పాల్పడుతున్న 55మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ లు ఉన్నాయని తప్పించుకున్నవారెవరినీ వదిలే ప్రసక్తిలేదని ఆయన అన్నారు. అయితే కాల్పులలో ఒకరు మృతిచెందారని చెప్పారు.  పోలీసుల వైపు నుంచి కాల్పులు జరపలేదని చెప్పారు.

Latest Updates