ఉత్తరాఖంఢ్ టూరిజం మంత్రి భార్యకు కరోనా

డెహ్రాడూన్: ఉత్తారఖంఢ్ టూరిజం మంత్రి సత్పాల్ మహారాజ్ భార్య, మాజీ మంత్రి అమృతా రావత్​కు కరోనా సోకింది. దీంతో ఆమె ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నారని మంత్రి ఓఎస్డీ అభిషేక్ శర్మ ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆమె కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు. వారి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని టెస్టులకు పంపిస్తామన్నారు. అమృతా రావత్.. హరీష్ రావత్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. డెహ్రాడూన్ సచివాలయంలో సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి మంత్రి సత్పాల్ హాజరయ్యారు. దీంతో మంత్రివర్గ సభ్యులను, ఉన్నతాధికారులు, అక్కడ ఉన్న సిబ్బందికి టెస్టులు నిర్వహించనున్నట్లు డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ ఆశిష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రభుత్వ నిర్దేశిత ప్రొటోకాల్ అనుసరిస్తామన్నారు. ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకు కరోనా బారిని పడినవారి సంఖ్య 749 కు పెరిగింది. ఐదుగురు చనిపోయారు.

Latest Updates