ఇండియా మానవత్వం..నేపాల్ బాలిక కోసం తెరుచుకున్న వంతెన

తాజాగా ఉత్తరాఖండ్‌ పితోరాగఢ్‌ జిల్లాలోని అంతర్జాతీయ సస్పెన్షన్‌ బ్రిడ్జిని భారత్‌ ఓ అరగంట పాటు ఓపెన్ చేసింది.

నేపాల్ కు చెందిన బాలిక పొత్తికడుపులో గడ్డలతో బాధపడుతోది. అయితే ఆ బాలికను పితోరాగఢ్ ఆస్పత్రిలో చేర్పించాల్సి ఉంది. అలా చేర్పించాలంటే అంతర్జాతీయ సస్పెన్షన్‌ బ్రిడ్జి ఒకటే మార్గం. దీంతో బాలిక తల్లి రేవతిదేవి బ్రిడ్జ్ ని ఓపెన్ చేయాలని కోరింది. దీంతో భారత్ వెంటనే కలెక్టర్ సమక్షంలో బ్రిడ్జిని ఓపెన్ చేయించి బాలికను ఆస్పత్రిలో చేర్పించింది.

పొత్తి కడుపులో గడ్డలతో బాధపడుతున్న నేపాలీ బాలిక పితోరాగఢ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వంతెన ఒక్కటే మార్గం కావడంతో.. నేపాల్ ప్రభుత్వం అనారోగ్యంతో ఉన్న బాలిక ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని భారత్‌ను కోరింది.

ఈ మేరకు  ధార్చులా డిప్యూటీ కలెక్టర్ అర గంట పాటు వంతెనను తెరిచి ఉంచేందుకు అనుమతించినట్టు తెలిపారు. ఆ అమ్మాయితో పాటు ఇరువైపుల నుంచి వచ్చిన జనం వంతెన దాటారు. చికిత్స కోసం సరిహద్దు వెంబడి తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని నేపాల్ అధికారులను కోరినట్లు బాలిక తల్లి రేవతిదేవి వెల్లడించారు.

Latest Updates