శంకరపల్లిలో యూవిక్‌‌ కొత్త ప్లాంట్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఇప్పటికే తెలంగాణలో ఒక మాన్యుఫ్యాక్చరింగ్‌‌ ప్లాంట్‌‌ను ఆపరేట్‌‌ చేస్తున్న యూవిక్‌‌, తాజాగా  శంకరపల్లిలో మరో ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. 6–10 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త ప్లాంట్‌‌ను నెలకొల్పాలనుకుంటోంది.  ఇప్పటికే రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టామని, కొత్త ప్లాంట్‌‌పై మరో  రూ. 5  కోట్లను వెచ్చించనున్నామని యూవిక్‌‌ మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ తరుణ్‌‌ సందీప్‌‌ చెప్పారు. ఐడీఏ బొల్లారంలో  ఆపరేట్‌‌ చేస్తున్న  ప్లాంట్‌‌కు 3 లక్షల ఎస్‌‌ఎఫ్‌‌టీ సామర్ధ్యం ఉందని, కొత్త ప్లాంట్‌‌తో దీనిని రెట్టింపు చేయనున్నామని పేర్కొన్నారు. బొలారం ప్లాంట్‌‌లో 25 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త ప్లాంట్‌‌తో మొత్తంగా మరో 50–60 మందికి ఉద్యోగాలు కల్పించనున్నామని కంపెనీ తెలిపింది.   ఈ కంపెనీకి టెక్నాలజీ పార్టనర్‌‌ జపనీస్‌‌ కంపెనీ వైకేకే ఏపీ . ఇండియాలో అల్యుమినియం విండోలు, డోర్‌‌‌‌లను యూవిక్‌‌ తయారుచేస్తోంది. తెలంగాణతోపాటు, దక్షిణాది  రాష్ట్రాలన్నింటికీ మాన్యుఫ్యాక్చరింగ్‌‌ విస్తరించాలని ప్లాన్‌‌ చేస్తున్నట్లు తరుణ్‌‌ సందీప్‌‌ వెల్లడించారు.  వైకేకేతో కలిసి ఇండియా మొత్తం మీద వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్లాన్స్‌‌ వేస్తున్నామని సందీప్‌‌ అన్నారు. ప్రస్తుతం యూవిక్‌‌ రూ. 60 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపడుతోందని అన్నారు.  యూపీవీసీ ప్రొడక్ట్స్‌‌తో పోలిస్తే అల్యూమినియం  విండోలు, డోర్స్‌‌కు క్రమంగా ఆదరణ పెరుగుతోందని తెలిపారు.

UWIC Windows & Doors plans new plant

Latest Updates