V6 న్యూస్ బోనాలు సాంగ్ : మా బొట్టూ బోనం.. నిప్పుల దూపం..

మన పండుగ బోనాలు వచ్చేసింది.. వీ6 న్యూస్ సాంగ్ జోష్ తెచ్చేసింది.. ఈ ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్న బోనాల కోసం.. మా బొట్టూ బోనం.. నిప్పుల దూపం.. పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మా అంటూ వీ6 పాట తీసుకొచ్చింది. మన కట్టు, బోనంబొట్టు, యాప రిమ్మలు, పోతరాజులు, శివసత్తులతోటి ఖతర్నాక్ పాట ఇది. బోనం పూదిచ్చినంత ముద్దుగా పాటను రాశారు మన పల్లెపాటగాడు గోరెటి వెంకన్న. పద పదానికి ఊపునిస్తూ.. వరం పాడితే.. పాటకు తీన్మార్ డప్పుల దరువేయిస్తూ.. తన సంగీతంతో మైమరిపించారు భోలే శావలి.  ఇంకా ఎందుకు ఆలస్యం.. చూసేయండి.. దరువు వేసేయండి..

Posted in Uncategorized

Latest Updates