V6 సీఈవో అంకం రవికి తెలంగాణ స్వర్ణ కమలం స్పెషల్ ఆనర్ అవార్డు

V6 సీఈవో అంకం రవికి తెలంగాణ స్వర్ణ కమలం స్పెషల్ ఆనర్  అవార్డు

హైదరాబాద్: తెలంగాణ యాసతో ప్రజలకు దగ్గరైన V6 న్యూస్ చానెల్ సీఈవో అంకం రవికి స్పెషల్ అవార్డు దక్కింది. తెలంగాణ సినీ స్వర్ణ కమలం స్పెషల్ ఆనర్ అవార్డుకు ఆయనను ఎంపిక చేసినట్లు బీజేపీ సినిమా సెల్ కన్వీనర్, సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. గడిచిన కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం  నంది అవార్డులు  ఇవ్వటంలేదని, దీంతో  బీజేపీ  సినిమా సెల్... సినిమా అవార్డులు  ఇస్తోందని సీవీఎల్ చెప్పారు. తెలంగాణ సినీ స్వర్ణ కమలం అవార్డుకు దర్శకులు  శేఖర్ కమ్ముల,  తరుణ్ భాస్కర్, జీవన్ రెడ్డి,  నటులు ఫిష్ వెంకట్, ప్రియదర్శి,  రాహుల్ రామకృష్ణ,  ప్రీతి నిగమ్‌లతో  పాటు... మరికొందరికి అవార్డులు దక్కినట్లు అవార్డు కమిటీ  చైర్మన్ వెంకట రమని,  బీజేపీ సినిమా  సెల్ కన్వీనర్  CVL నర్సింహారావు ప్రకటించారు. కవి అందెశ్రీ,  నటుడు  ఆర్.నారాయణమూర్తి , వీ6 వెలుగు  CEO  అంకం రవిలకు తెలంగాణ సినీ స్వర్ణ కమలం స్పెషల్ ఆనర్ అవార్డులు  ప్రకటించారు. తెలంగాణ  కల్చర్‌‌ను,  భాషను  ప్రజల్లోకి  తీసుకువెళ్లిన వ్యక్తి అని అంకం రవి అన్నారు సీవీఎల్  నర్సింహారావు.  తెలంగాణలో  సంస్కృతి,  సంప్రదాయాలను..  మీడియా ద్వారా  ప్రజల్లోకి  తీసుకువెళ్లారని  తెలిపారు. తెలంగాణ  కల్చర్ కోసం  ఊపిరులూదుతున్న అంకం రవికి తెలంగాణ  స్వర్ణకమలం  స్పెషల్ ఆనర్  అవార్డును  ప్రకటించామన్నారు  నర్సింహారావు.