వీ6 వెలుగు క్రికెట్ టోర్నీ: సిద్దిపేట టీమ్ గ్రాండ్ విక్టరీ

  • 89 పరుగుల తేడాతో దుబ్బాక జట్టుపై విజయం
  • 65 బంతుల్లో సెంచరీ కొట్టిన సిద్దిపేట ప్లేయర్

సిద్దిపేట: వీ6 వెలుగు ఆధ్వరంలో జరుగుతున్న క్రికెట్ టోర్నీలో సిద్దిపేట టీమ్ గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది. బుధవారం సిద్దిపేటలో జరిగిన మ్యాచ్ లో దుబ్బాక జట్టుపై 89 పరుగులు తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన సిద్దిపేట టీమ్ వీర బాదుడు బాదింది. 20 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే లాస్ అయింది. 181 పరుగులు చేసి దుబ్బాక టీమ్ ముందు భారీ టార్గెట్ ను పెట్టింది.

బౌలింగ్ లోనూ సిద్దిపేట జట్టు ఇరగదీసింది. భారీ లక్ష్యంతో ఒత్తిడిలో బరిలోకి దిగిన దుబ్బాక టీమ్ వికెట్లను ఫటాఫట్ తీసేసింది. 89 పరుగులకే ఆలౌట్ చేసేసి విజయాన్ని సొంతం చేసుకుంది సిద్దిపేట టీమ్.

పూజల సుశీల్ కీ రోల్

సిద్దిపేట జట్టు విజయంలో ప్లేయర్ పూజల సుశీల్ కీ రోల్ ప్లే చేశాడు. 65 బంతుల్లో 101 పరుగులు చేసి టీమ్ కు భారీ స్కోర్ ను అందించాడు. దుబ్బాక టీమ్ ను డిఫెన్స్ లో పడేశాడు.

13 ఫోర్లు, 5 సిక్స్ లతో సెంచరీ పూర్తి చేశాడు సుశీల్. వీర విహారం చేస్తున్న అతడి జోరుకు గాయం బ్రేక్ వేసింది.  రిటైర్డ్ హీర్ట్ గా అతడు వెనుదిరగాల్సి వచ్చింది.

సెమీస్ కు చేరిన కల్వకుర్తి

ఇక నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగు క్రికెట్ టోర్నీ రెండోరోజు ఉత్సాహంగా జరిగింది. కల్వకుర్తి పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో ఇవాళ 3 మ్యాచ్ లు జరిగాయి. మొదటి మ్యాచ్ లో అచ్చంపేటపై 7 వికెట్ల తేడాతో నాగర్ కర్నూల్ విజయం సాధించింది. తర్వాత.. నాగర్ కర్నూల్ పై కల్వకుర్తి టీమ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మూడో మ్యాచ్ లో అచ్చంపేటపై 4 పరుగుల తేడాతో కొల్లాపూర్ గెలిచింది. ఇక గ్రూప్ బి నుంచి కల్వకుర్తి సెమీస్ కు చేరుకుంది. రేపు మహబూబ్ నగర్ లో రెండు సెమీస్ మ్యాచ్ లు జరగనున్నాయి.

సూర్యాపేటలో…

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెండోరోజు టోర్నీని మున్సిపల్ ఛైర్మన్ గూడూరి ప్రవళ్లిక ప్రకాశ్ ప్రారంభించారు. సూర్యాపేట.. కోదాడ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సూర్యాపేట టీమ్ విజయం సాధించింది. 16 ఓవర్లలో సూర్యాపేట 122 పరుగులు చేయగా.. 77 పరుగులకే కోదాడ టీమ్ ఆలౌట్ అయింది. దాంతో.. 45 పరుగుల తేడాతో సూర్యాపేట విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ హాజరయ్యారు. మ్యాచ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అన్వేష్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందించారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులకు వెలుగు టోర్నీ మంచి వేదికన్నారు.

Latest Updates