ఖమ్మంలో వెలుగు క్రికెట్ టోర్నీ అప్‌డేట్స్

ఖమ్మంలో వెలుగు క్రికెట్ టోర్నీ రెండో రోజుకు చేరింది. సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న టోర్నీలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్ వైరా, మధిర జట్ల మధ్య జరిగింది. ముందుగా వైరా జట్టు బ్యాటింగ్ కు దిగి 154 పరుగులు చేసి ఆలౌటైంది. ఛేజింగ్ కు దిగిన మదిర జట్టు 13.2 ఓవర్లలోనే 96 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో వైరా జట్టు 58 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రెండో మ్యాచ్ ఖమ్మం vs పాలేరు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాలేరు జట్టు 20 ఓవర్లలో 131 పరుగులు చేసింది. ఛేజింగ్ కు దిగిన ఖమ్మం జట్టు… 17.3 ఓవర్లలోనే టార్గెట్ ఫినీష్ చేసి…. పాలేరు జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి… 4 వికెట్లు తీసిన రాజశేఖర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Latest Updates