దేశాభివృద్ధికి కీలకం మహిళాశక్తే

మార్చి 8,  ఈ రోజు మనందరికీ ఎంతో స్పెషల్​. -అనేక రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను గుర్తుకు తెచ్చుకుంటూ, వారిని గౌరవిస్తూ, ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ నిర్వహించుకుంటున్నాం. కృషి, పట్టుదలతో సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ ముందుకు సాగటం మహిళలకు బాగా తెలుసు. మహిళలకు అంకితం చేసిన ఈ రోజును స్మరించుకోవడం వ్యక్తిగతంగా నాకెంతో ఆనందాన్నిస్తోంది.

దేశాన్ని, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే కృషిలో మహిళలు ఎప్పుడూ భాగస్వాములే. తిరుగులేని విజయాలతో మగవాళ్లతో పోటీ పడుతున్న భారత మహిళలకు ఇక ఆకాశమే హద్దు. ఇవాళ సైన్స్​లో, టెక్నాలజీలో, పాలిటిక్స్​లో మహిళలు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. పాలిటిక్స్​ నుంచి కార్పొరేట్ రంగందాకా అన్ని  అడ్డంకులనూ అధిగమించి ముందడుగు వేస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ సక్సెస్​ దిశగా దూసుకుపోతున్నారు.

పంచాయితీ లకు నాయకత్వం వహిస్తూ రూరల్ ఇండి యాకి కొత్త డైరక్షన్ ఇస్తున్నారు. అన్ని అంశాలపై ఎప్పటికప్పుడు స్పష్టమైన అవగాహనతో లక్ష్యం దిశగా సాగిపోతున్నారు.  ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఎంతో కీలకం. మన సాంస్కృతిక వారసత్వం చాలా గొప్పది. మహిళలకు వెన్నుదన్నుగా ఉంటూ వాళ్లను అన్ని రంగాల్లో ప్రోత్సహించే కల్చర్​ మనది. ఇక్కడ ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అనే మాటను గుర్తు చేసుకోవాలి. ‘ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు’ అని ఈ శ్లోకానికి అర్థం. అందుకే మన ఆడబిడ్డలకు నాణ్యమైన విద్యనందించి దేశాభివృద్ధికి వాళ్లు కృషి చేసేలా చూడాల్సిన బాధ్యత మనందరిది.

మహిళా సాధికారత అనే మాట ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఉమెన్​ ఎంపవర్​మెంట్​ సాధ్యపడాలంటే ముందుగా వాళ్లను నిపుణులుగా తీర్చిదిద్దాలన్నది నా అభిప్రాయం. ఒక మహిళ ఏదైనా ఒక రంగంలో ఎక్స్​పర్ట్​ అయినప్పుడు. ఆమె తన కుటుంబాన్నే గాక మొత్తం సమాజాన్నే తీర్చిదిద్దగలదు. మహిళలందరూ చదువుకుంటే తప్ప మనం ఆశించే లక్ష్యాలను చేరుకోలేమన్నది నూటికి నూరుపాళ్లు వాస్తవం. ఉమెన్​ ఎంపవర్​మెంట్​ కోసం మా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి కౌశల్​ వికాస్​ యోజన, బేటీ బచావో–బేటీ పడావో, సుకన్య సమృద్ధి​, సఖి పథకం, లాడ్లీ పథకం, డిజిటల్ లాడో, స్వచ్చభారత్ వంటివి అందులో కొన్ని పథకాలు.

స్కిల్ డెవలప్​మెంట్​కి ప్రాధాన్యం

అనేక రంగాల్లో మహిళల స్కిల్ డెవలప్​మెంట్​కు కేంద్ర సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నా మినిస్ట్రీ పరిధిలోని స్కిల్​ డెవలప్​మెంట్​ అండ్​ ఎంటర్​ప్రెన్యూర్​​, ఉమెన్ అండ్​ చైల్డ్​ డెవలప్‌మెంట్​, హ్యూమన్​ రీసోర్సెస్​ డెవలప్​మెంట్​ వంటి శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. మహిళలకు సాధికారత కల్పించనిదే ఏ దేశమైనా, సమాజమైనా పూర్తిగా డెవలప్ కాదు.

ప్రతి మహిళలోనూ వారికే సొంతమైన ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్​ను గుర్తించి, తీర్చిదిద్దగల ఒక యంత్రాంగం ఉండాలి. దేశవ్యాప్తంగా వివిధ వృత్తులలో ఉన్న మహిళలందరూ తమ టాలెంట్​ను డెవలప్ చేసుకోవడానికి అవకాశాలుండాలి. వాళ్లకు ఉద్యోగ భరోసా అందించగలగాలి. స్కిల్ డెవలప్​మెంట్ మంత్రిగా ఇది నా బాధ్యతగా భావిస్తున్నా. స్కిల్ డెవలప్​మెంట్ కార్యక్రమాల కింద- మా మినిస్ట్రీ సుమారు 68 అంశాలను ఎంచుకుంది. దేశం మొత్తంమీద ‘ప్రధానమంత్రి కౌశల్ యోజన 2.0’ కింద ఇప్పటిదాకా 12 లక్షల మంది మహిళలకు శిక్షణ ఇచ్చాం. 2018–20 మధ్య కాలంలో జన శిక్షణ్ సంస్థాన్ పథకం కింద దాదాపు 4.08 లక్షల మందికి ట్రైనింగ్​ ఇచ్చాం. పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో 38.72 లక్షల మంది మహిళలు శిక్షణ పొందారు. ప్రస్తుతం దేశంలో ఉమెన్​ ట్రైనింగ్​ ఇనిస్టిట్యూషన్లు18 వరకు ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో కూడా

సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంటర్​ప్రెన్యూర్​షిప్ వంటి కోర్సుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు చేరడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.  ఈ తరానికి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా విశ్లేషణ, త్రీడీ ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్, -హార్డ్ వేర్,  హెల్త్ కేర్, బ్యూటీషియన్, ఫ్యాషన్​ టెక్నాలజీ వంటివి చదువుతున్నారు. మహిళల్లో స్కిల్స్​ను పెంచుతూ,  ఉద్యోగ ఉపాధి రంగాల్లో ప్రోత్సహించడానికి నేషనల్​ రూరల్​ లైవ్​లీహుడ్స్​ మిషన్​ ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రధానమంత్రి స్కిల్​ డెవలప్​మెంట్​ ట్రైనింగ్​ ప్రోగ్రాం కింద ఏర్పాటు చేసిన సెంటర్లలో పెద్ద సంఖ్యలో మహిళలకు  ట్రైనింగ్ ఇస్తున్నాం. కేంద్ర పథకాలైన ఆయుష్మాన్ భారత్, స్వచ్చ భారత్, స్మార్ట్ సిటీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. మోడర్న్​ ఇండియా మేకింగ్​లో మహిళా ఎడ్యుకేషన్​, స్కిల్స్​ బాగా కీలకం కాబోతున్నాయి.

ఆత్మవిశ్వాసాన్ని పెంచిన ఘనత మాదే

మా ప్రభుత్వ కృషి ఫలితంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కొన్నేళ్లుగా చదువుకున్న ఆడపిల్లల సంఖ్య పెరిగింది. ప్రొఫెషనల్​గా స్కిల్ డెవలప్​మెంట్ పెంచుకున్నవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. దేశంలోని ప్రతి మహిళకు చదువుతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి అయ్యే అవకాశాలను పెంచాలని నిర్ణయించుకున్నాం.

——————————————

20వ శతాబ్దంలో పవర్​ఫుల్​ లీడర్​షిప్​ అందించిన ప్రపంచంలోని 100 మంది లేడీస్​తో టైమ్స్​ రూపొందించిన​ లిస్టులో ఇండియా వాళ్లు ఇద్దరు ఉండగా వారిలో అమృత్​ కౌర్​ ఒకరు. పంజాబ్​లోని కపుర్తలా రాయల్​ ఫ్యామిలీకి చెందిన ఈమె దేశ సేవలోనూ రాజకుమారిగా పేరొందారు. ఫస్ట్​ మహిళా కేబినెట్​ మినిస్టర్ కూడా. సొంత ఆస్తితో ఎయిమ్స్​లాంటి సంస్థను ఏర్పరిచారు. అమ్మాయిల పెళ్లీడును 18 ఏళ్లకు పెంచారు.​ కౌర్​  జీవితాన్ని ఇండిపెండెన్స్​కి ముందు, తర్వాత అని రెండుగా చెప్పుకోవచ్చు. ఈ రెండింటిలోనూ నేటి తరం ఎరగని విశేషాలెన్నో ఉన్నాయి.

తరాలు మారినా ‘ఐరన్​ లేడీ’గా ఇందిరాగాంధీ గురించి తెలియనివారు ఉండరు. కానీ, ఈ తరంలో మాత్రం.. ఆమెలాంటి మరో పవర్​ఫుల్​ లేడీ రాజకుమారి అమృత్​కౌర్ గురించి తెలిసినవారు పెద్దగా లేరు. ఈమె మన దేశ చరిత్రలో ప్రత్యేక పేజీలు కేటాయించదగ్గ గొప్ప మహిళ. ఫ్రీడం ఫైటర్​. మొట్టమొదటి సెంట్రల్​ హెల్త్​ మినిస్టర్ ​మాత్రమే కాదు. కేబినెట్​ హోదా పొందిన తొలి మహిళా మంత్రి కూడా. ఇలా చెప్పుకుంటూపోతే అందరి కన్నా ముందు అమృత్​ కౌర్ జాతీయంగా, అంతర్జాతీయంగా చేపట్టిన పెద్ద పదవులెన్నో ఉన్నాయి.

రాజభోగాలు అనుభవించాల్సిన కుటుంబంలో పుట్టినా వాటన్నింటినీ వదులుకొని దేశ సేవ కోసం జీవితాన్నే అంకితం చేసిన ఆదర్శవంతమైన, శక్తిమంతమైన మహిళ అమృత్​కౌర్​. పెళ్లి కూడా చేసుకోకుండా చివరి శ్వాస వరకూ ప్రజాసేవలోనే గడిపారు. బాపూజీ బాటలో నడిచి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఆ మహాత్ముని​ సెక్రెటరీల్లో ఒకరిగా ఏకంగా 16 ఏళ్ల పాటు పనిచేశారు. జాతిపిత బోధనలను, ఆచరణలను తూచా తప్పకుండా పాటించారు. ఇండిపెండెన్స్​ వచ్చాక పదేళ్లపాటు కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్నారు.

ఇంగ్లండ్​లో చదివినా

1889 ఫిబ్రవరి 2న లక్నోలో రాజా హర్నమ్​ సింగ్​ (కపుర్తలా రాజుకి చిన్న సోదరుడు) దంపతులకు పుట్టిన ఏడుగురు సంతానంలో అమృత్​కౌర్​ ఒక్కరే అమ్మాయి. ఇంగ్లండ్​లోని ఫేమస్​ స్కూల్​, కాలేజీ, వర్సిటీల్లో చదువుకున్నారు. 1918లో 29 ఏళ్ల వయసులో ఇండియాకి తిరిగొచ్చారు. ఆ రోజుల్లో చాలా మంది ఫ్రీడం ఫైటర్లు, ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​ లీడర్లు వాళ్ల ఇంటికి వచ్చేవారు.​ జాతీయోద్యమం గురించి అమృత్​ కౌర్​ తండ్రి రాజా హర్నమ్​ సింగ్​తో మాట్లాడుతుండేవారు. వారిలో గోపాలకృష్ణ గోఖలే ఒకరు.

ఆయనతో పరిచయం అమృత్​ కౌర్​ జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ క్రమంలో 1919లో ఓసారి మహాత్మా గాంధీతో కూడా మాట్లాడారు. ఇక అప్పటి నుంచి ఆమె పూర్తిగా ఫ్రీడం ఫైట్​లోనే పాల్గొన్నారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత గాంధీ ఆశ్రమంలోనే ఉండిపోయారు. 1927లో ఆలిండియా ఉమెన్స్​ కాన్ఫరెన్స్​ని ఏర్పాటుచేసి 1930లో సెక్రెటరీ, 1933లో ప్రెసిడెంట్​ అయ్యారు. 1930లో దండి యాత్రలో, 1937లో ఉప్పు సత్యాగ్రహంలో, 1942లో క్విట్​ ఇండియాలో పాల్గొన్నారు. పలుమార్లు జైలుకెళ్లారు.

గ్లోబల్​ లీడర్​గా

అమృత్​ కౌర్​ ఆలిండియా ఉమెన్స్​ ఎడ్యుకేషన్​ ఫండ్​ అసోసియేషన్​ చైర్​పర్సన్​గా, న్యూఢిల్లీలోని లేడీ ఇర్విన్​ కాలేజీ ఎగ్జిక్యూటివ్​ కమిటీ మెంబర్​గా సేవలందించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈమెను ఎడ్యుకేషన్​ బోర్డులో అడ్వైజరీ మెంబర్​గా నియమించింది. ‘క్విట్​ ఇండియా’ సమయంలో కౌర్​ ఈ పదవికి రాజీనామా చేశారు. 1945, 46ల్లో లండన్​, పారిస్​లలో జరిగిన యునెస్కో కాన్ఫరెన్స్​ల్లో మన దేశ ప్రతినిధి బృంద సభ్యురాలిగా ఉన్నారు. ఆడపిల్లల చదువు కోసం కృషి చేశారు. బాల్య వివాహాల రద్దుకు పోరాడారు.

‘ఎయిమ్స్’ కోసం సొంత ఆస్తి​

తొలి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ ప్రభుత్వంలో కేబినెట్​ ర్యాంక్​తో సెంట్రల్​ హెల్త్​ మినిస్టర్​గా పగ్గాలు చేపట్టి పదేళ్లపాటు అద్భుతంగా పనిచేశారు. 1950ల్లో వరల్డ్​ హెల్త్​ అసెంబ్లీ ప్రెసిడెంట్​గా ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన మొదటి మహిళ, ఆసియాకు చెందిన తొలి వ్యక్తిగా రికార్డ్​ సృష్టించారు. ఢిల్లీలో ఆలిండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​(ఎయిమ్స్​) ఏర్పాటుకి కర్త, కర్మ, క్రియ అమృత్​ కౌరే. ఈ మేరకు న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా, వెస్ట్​ జర్మనీ, స్వీడన్​, అమెరికా సాయం తీసుకున్నారు. ఆ సంస్థకు ఫస్ట్​ ప్రెసిడెంట్​ కూడా ఈమే.

అన్ని రంగంలోనూ

కార్పొరేట్ రంగంలోనూ ఈ తరం మహిళలు సత్తా చాటుతున్నారు. బోర్డు డైరెక్టర్ల నుంచి సీఈవో స్థాయిదాకా బాధ్యతలు అందుకుంటున్నారు. సమాచార సాంకేతిక రంగాలతో పాటు బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రవేశిస్తున్నారు. కిందటేడాది  చంద్రయాన్- –2 ప్రయోగ బాధ్యతలను ఇద్దరు మహిళలకు ఇండియన్​ స్పేస్ రీసెర్చ్​ ఆర్గనైజేషన్​ (-ఇస్రో) అప్పగించడాన్ని గుర్తు చేసుకుంటే… స్పేస్ సైన్స్​లో కూడా మన స్త్రీలు ఎవరికీ తీసిపోరని స్పష్టమవుతోంది.

ఆడపిల్లల పెళ్లి వయసు పెంచింది

అమృత్​ కౌర్​ కృషి వల్లే ఆడపిల్లల పెళ్లి వయసు 14 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు పెరిగింది. అమృత్​కౌర్​ 1957 నుంచి 1964లో (75వ ఏట) చనిపోయే వరకు రాజ్యసభ ఎంపీ​గా సేవ చేశారు. ఎయిమ్స్​, టీబీ​ అసోసియేషన్​, సెయింట్​ జాన్స్​ అంబులెన్స్​ కార్ప్స్​ వంటి సంస్థలకు ప్రెసిడెంట్​గా కొనసాగారు. ఇండిపెండెన్స్​ రాకముందు, వచ్చాక ఎన్నో సామాజిక, రాజకీయ సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. దేవదాసీ, పర్దా వంటి సంఘ సంస్కరణలు, మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడారు.

Latest Updates