16 నుంచి వ్యాక్సినేషన్.. జిల్లాకు మూడు సెంటర్లు

16 నుంచి వ్యాక్సినేషన్.. తొలి రోజు 13,900 మందికి..

మొదట 3లక్షల మంది హెల్త్ స్టాఫ్ కు వ్యాక్సిన్  

వారందరికీ  వారంలోనే ఫస్ట్ డోస్..  28 రోజుల తర్వాత సెకండ్ డోస్

స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సినేషన్‌ డేట్ ఖరారైంది. ఈ నెల 16న దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ వేస్తమని కేంద్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది. మన
రాష్ట్రంలో అదే రోజు ఉదయం 9 గంటల నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్(డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తొలి రోజు రాష్ర్ట వ్యాప్తంగా 45 ప్రైవేట్‌, 94 ప్రభుత్వ సెంటర్లలో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. వీటిలో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండనున్నాయి. మొదటి రోజు ఒక్కో జిల్లాలో 2 లేదా 3 సెంటర్లలో మాత్రమే వ్యాక్సినేషన్ జరగనుంది. ఒక్కో సెంటర్‌‌లో వంద మంది చొప్పున 13,900 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 17న రాష్ర్ట వ్యాప్తంగా పల్స్‌‌ పోలియో చుక్కలు వేయనున్నారు. ఆరోజు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఉండదని, 18 నుంచి సుమారు 1,200 సెంటర్లలో వ్యాక్సినేషన్ కొనసాగిస్తామని శ్రీనివాసరావు వివరించారు. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు 2.9 లక్షల మంది హెల్త్ కేర్‌‌‌‌ వర్కర్ల వివరాలను కోవిన్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌లో రిజిస్టర్ చేశారు. వీరిలో సుమారు 1.35 లక్షల మంది ప్రభుత్వ దవాఖాన్ల డాక్టర్లు, సిబ్బంది.. 1.55 లక్షల మంది ప్రైవేట్ డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు. వ్యాక్సినేషన్ తేదీ నాటికి ఈ సంఖ్య 3 లక్షల వరకు పెరగొచ్చని శ్రీనివాసరావు తెలిపారు. వారం రోజుల్లోనే వీళ్లందరికీ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత 28వ రోజు నుంచి సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇస్తారు. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్‌‌ లైన్ వర్కర్లైన పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. కాగా, వ్యాక్సినేషన్ ప్రారంభించే రోజున (16న) రాష్ర్టంలోని రెండు వాక్సిన్ సెంటర్ల సిబ్బందితో ప్రధాని మోడీ ఇంటరాక్ట్ కానున్నారు. వ్యాక్సినేటర్లు, హెల్త్ స్టాఫ్‌‌తో మాట్లాడనున్నారు.

6.5 లక్షల డోసులు

ఫస్ట్ ఫేజ్ లో హెల్త్ కేర్‌‌‌‌ వర్కర్లకే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. రాష్ర్టంలో 3 లక్షల మందికి ఇవ్వనున్న నేపథ్యంలో వేస్టేజీతో కలిపి రెండు డోసులకు సరిపడా 6.5 లక్షల డోసులు రానున్నాయి. పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్టోరేజ్ సెంటర్ నుంచి సోమ లేదా మంగళవారం హైదరాబాద్‌‌కు కోవిషీల్డ్‌‌ వ్యాక్సిన్‌‌ డోసులు వస్తాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వీటిని కోఠిలోని సెంట్రల్ డ్రగ్‌‌ స్టోరేజ్ సెంటర్‌‌‌‌లో భద్రపర్చనున్నారు. ఏయే జిల్లాకు ఎన్ని డోసులు అవసరమో నిర్ధారించి, వ్యాక్సినేషన్‌‌కు ముందు రోజు అక్కడి స్టోరేజ్ సెంటర్లకు తరలించనున్నారు. ఇందుకోసం జిల్లాకు ఒకటి చొప్పున ఇన్సులేటర్‌‌(కోల్డ్‌‌)‌‌ వెహికిల్స్‌‌ను కొనుగోలు చేశారు.

ఫస్ట్‌‌ వ్యాక్సిన్ నేనే వేసుకుంట: ఈటల

కరోనా తొలి వ్యాక్సిన్ ను తానే వేసుకుంటానని మంత్రి ఈటల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. కరోనా నోడల్ సెంటర్‌‌‌‌గా ఉన్న గాంధీ హాస్పిటల్‌‌ లేదా హైదరాబాద్‌‌లోని మరేదైనా సెంటర్‌‌‌‌లో ఆయన వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉందని మంత్రి కార్యాలయం వెల్లడించింది.

For More News..

సడెన్​గా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

గులాబీ లీడర్ల గొంతులు మూగబోయినయ్​!

Latest Updates