అన్ని ప్రయత్నాలు ఫలిస్తే ఈ ఏడాదిలోనే వ్యాక్సిన్: బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేశారు. కరోనాను అంతమొందించేందుకు వ్యాక్సిన్ రూపకల్పనలో ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. అనుకున్న విధంగా అన్ని పనులు జరిగితే ఏడాది లోపే వ్యాక్సిన్ తయారీని మొదలు పెట్టనున్నామని చెప్పారు. ఒకవేళ అది సాధ్యం కాకుంటే రెండేళ్ల లోపు కరోనాకు మందు కనుక్కోవడానికి సమయం పట్టవచ్చన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సెప్టెంబర్ లో ప్రారంభం కాదన్నారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు ఎన్నో ప్రయత్నాలతో పనులు స్పీడ్ గా జరుగుతున్నాయని చెప్పారు బిల్ గేట్స్.

Latest Updates