రాష్ట్రమంతా నేడు వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ డ్రై రన్‌‌‌‌‌‌‌‌

1200 సెంటర్లు ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌‌‌‌‌‌‌‌ను రాష్ట్రమంతా ఒకే రోజు నిర్వహించాలని హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ నిర్ణయించింది. తొలుత 7, 8 తేదీల్లో డ్రై రన్ చేపట్టాలని భావించారు. ఇలా చేస్తే సమస్యలు, కమ్యునికేషన్ గ్యాప్స్‌‌‌‌‌‌‌‌ తెలియవన్న ఉద్దేశంతో ఈ నెల 8వ తేదీన ఒక్కరోజే  రాష్ట్రమంతా  డ్రైరన్​కు ఏర్పాట్లు పూర్తి చేశారు. 33 జిల్లాల్లోని 1,200 సెంటర్లలో డ్రైరన్ నిర్వహించనున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. డ్రైరన్‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్లు పర్యవేక్షిస్తారని చెప్పారు. జిల్లా, మండల స్థాయి వరకు  డ్రైరన్‌‌‌‌‌‌‌‌ తీరును పరిశీలించేందుకు స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌లో మూడు టీమ్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా లెవల్‌‌‌‌‌‌‌‌లో మరిన్ని టీమ్స్ పనిచేస్తాయని చెప్పారు. మరో మూడు, నాలుగు రోజుల్లో వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి వచ్చే అవకాశముందని చెప్పారు. తొలి దశలో హెల్త్ వర్కర్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని, ఫ్రంట్‌‌‌‌‌‌‌‌లైన్ వర్కర్ల గురించి ఇప్పటివరకు కేంద్రం నుంచి స్పష్టత రాలేదన్నారు. గురువారం అన్ని రాష్ట్రాల హెల్త్ మినిస్టర్లతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, డాక్టర్ హర్షవర్దన్ సమావేశం నిర్వహిస్తున్నారని, ఇందులో వ్యాక్సినేషన్ తేదీలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే చాన్స్ ఉందని చెప్పారు. వ్యాక్సిన్ సెంటర్లు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై రూపొందించిన పేపర్లను మీడియాకు విడుదల చేశారు.

417 మందికి కరోనా

రాష్ట్రంలో మరో 417 మందికి కరోనా సోకిందని హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రకటించింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు 43,318 మందికి టెస్ట్ చేయగా.. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ పరిధిలో 82, జిల్లాల్లో 335 కేసులు నమోదయ్యాయని బులెటిన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసులు 2,88,410కి చేరగా, ఇందులో 2,81,872 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.  మంగళవారం కరోనాతో మరో ఇద్దరు చనిపోగా, మృతుల సంఖ్య 1,556కు పెరిగింది.

For More News..

రెండు షిఫ్టుల్లో ఇంటర్ కాలేజీలు! కొంతమందికి ఉదయం.. మరికొంతమందికి మధ్యాహ్నం..

Latest Updates