2023 నాటికి కరోనా వైరస్ ఎలా ఉంటుందంటే..

కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభం, మార్చి నెలల్లో కరోనా వ్యాక్సిన్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా… వ్యాక్సిన్ రక్షణ ఎన్ని సంవత్సరాల ఉంటుందనే అంశంపై అనేక అనుమానాలున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ ను ఎన్నినెలలు, సంవత్సరాల వరకు సురక్షితంగా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు ఢిల్లీ ఎయిమ్స్ డైరక్టర్ రణ్ దీప్ గులేరియా.

కరోనా వైరస్ పై విడుదల కానున్న “టిల్ వి విన్” అనే పుస్తకానికి సహ రచయితగా మారిన ఎయిమ్స్ డైరక్టర్ రణ్ దీప్ గులేరియా మాట్లాడుతూ..కరోనా వైరస్ వ్యాక్సిన్ ను తొమ్మిది నెలల నుంచి సంవత్సరం వరకు సురక్షితంగా ఉంటుందన్నారు. అంతేకాదు వ్యాక్సిన్ వల్ల వైరస్ ట్రాన్స్ మిషన్ తగ్గుతుందని స్పష్టం చేశారు. 

కరోనా వైరస్ తగ్గే అవకాశం లేదని, అయితే 2023 నాటికి వైరస్ తేలికపాటి వ్యాధిగా మారవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 2023కు ముందే డబ్ల్యూహెచ్‌ఓ వైరస్ లేదన్న విషయాన్ని ప్రకటిస్తుందన్నారు ఢిల్లీ ఎయిమ్స్ డైరక్టర్ రణ్ దీప్ గులేరియా.

Latest Updates