ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ మనుషుల కోసం కాదు

కరోనావైరస్ కు వ్యాక్సిన్ దొరికిందంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై ఇండియాటుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కరోనా వైరస్ వార్తల్ని కొట్టిపారేసింది.

కరోనా వైరస్ వ్యాక్సిన్ పై పరిశోధనలు ఎంతవరకు వచ్చాయంటే

కరోనా వైరస్ పై ఇజ్రాయెల్‌లోని శాస్త్రవేత్తలు కరోనావైరస్ కోసం వ్యాక్సిన్‌ ను తయారు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఇండియా టుడే ప్రస్తావించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

ఢిల్లీకి చెందిన ఫేస్ బుక్ యూజర్  దీపాన్ష్ కుమార్ “కరోనా వైరస్ వ్యాక్సిన్” అని లేబుల్ ఉన్న ఇంజెక్షన్ బాటిల్  ఫోటోను పోస్ట్ చేశాడు. అంతేకాదు  కరోనా వైరస్ పై ఇక మరణం లేదు. దేవుడు ఇజ్రాయిల్ దేశస్థుల్ని ఆశీర్వదిస్తాడు. చివరగా కరోనా వైరస్ కు వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు క్యాప్షన్ యాడ్ చేశాడు.

కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి రావొచ్చు

కరోనా వైరస్ పై ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు ఎంతవరకు వచ్చాయనే అంశంపై ఆరా తీస్తే..వైరస్ కు విరుగుడు కనిపెట్టేందుకు కొన్ని నెలల టైం పడుతున్నట్లు తేలింది.  ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి కార్యాలయం పర్యవేక్షణలో ఇనిస్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ సైంటిస్ట్ లు ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. అయినప్పటికీ టీకాలు వేయవచ్చా..? లేదా..?  అనే విషయాలు పూర్తిస్థాయిలో నిర్ధారించడానికి నెలల సమయం పడుతుందని తేలింది.

ఫేస్ బుక్ యూజర్ పోస్ట్ చేసిన బాటిల్ సంగతేంటి

నెట్టింట్లో వైరల్ అవుతున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ఫోటోలను పలు సైట్లలో కొనుగోలు చేసినట్లు ఇండియా టుడే తేల్చింది.  ఇజ్రాయెల్ మైగల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్   “ఏవియన్ కరోనా వైరస్”/ఇన్ఫెక్షియస్ బ్రోన్కైటిస్ వైరస్ (ఐబివి) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది . ఆ వ్యాక్సిన్ కోళ్ల కోసమే కాని మనుషుల కోసం కాదని నిర్ధారణైంది. ఏవియన్ కరోనా వైరస్ అనేది కోళ్లలో ఊపిరితిత్తులు, పేగులు, కిడ్నీలపై దాడి చేసి అవి చనిపోయేలా చేస్తాయి. వాటికోసమే తయారు చేసింది ఈ ఏవియన్ కరోనా వైరస్.

ఎఫ్ డీఐ ఆమోదంతోనే వ్యాక్సిన్ విడుదల

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) ప్రకారం .. వ్యాక్సిన్లు, ట్యాబ్లెట్లను రిసెర్చ్ లో భాగంగా తొలిసారి జంతువులపై ప్రయోగం జరిపి..ఆ తరువాత మనుషులకు ఉపయోగపడేలా అందుబాటులోకి తెస్తారనే విషయాన్ని గుర్తించాలి.  ఎఫ్ డీఏ  వైద్యులు, సైంటిస్ట్ లు డ్రగ్స్ ను అందుబాటులోకి తెస్తే లేబులింగ్ పద్దతిలో వాటిని  వినియోగంలోకి తెస్తారు.

 

Latest Updates