పుణె నుంచి దేశమంతా వ్యాక్సిన్ల పంపిణీ

సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన 41 సెంటర్లకు తరలింపు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ల తరలింపుకు అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో టీకాల సప్లై స్టార్టవబోతోంది. పుణె సెంటర్‌‌‌‌‌‌‌‌గా దేశవ్యాప్తంగా సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన 41 సెంటర్లకు వ్యాక్సిన్లను పంపిణీ చేయబోతున్నారు. గురువారం సాయంత్రం నుంచి లేదా శుక్రవారం పొద్దున నుంచి తరలించనున్నారు. నార్త్‌‌‌‌‌‌‌‌ ఇండియా మొత్తానికి ఢిల్లీ, హర్యానాలోని కర్నాల్‌‌‌‌‌‌‌‌ నుంచి వ్యాక్సిన్లను పంపనున్నారు. ఈస్ట్‌‌‌‌‌‌‌‌ ఇండియాకు కోల్‌‌‌‌‌‌‌‌కతా, సౌత్‌‌‌‌‌‌‌‌ ఇండియాకు చెన్నై, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌గా పని చేయనున్నాయి. దేశవ్యాప్తంగా త్వరలో వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్త్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్లతో కేంద్ర హెల్త్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ హర్షవర్ధన్‌‌‌‌‌‌‌‌ వర్చువల్‌‌‌‌‌‌‌‌గా సమావేశమయ్యారు.  దేశంలోని 4 రాష్ట్రాల్లో జరిగిన డ్రై రన్‌‌‌‌‌‌‌‌ వివరాలను రివ్యూ చేశామని, ఆ ప్రకారం జనవరి 8వ తేదీన జరిగే మరో డ్రై రన్‌‌‌‌‌‌‌‌కు ఏర్పాట్లు చేశామని మంత్రి హర్షవర్ధన్‌‌ వెల్లడించారు.

For More News..

వ్యాక్సిన్​ రిజిస్ట్రేషన్​కు కమ్యూనిటీ సర్వీస్ సెంటర్లు

భూమి స్పీడ్​ పెరిగింది! రోజులు వేగంగా గడుస్తున్నయ్..

Latest Updates