వ్యాక్సిన్‌‌లు అన్ని రకాల మ్యూటెంట్లపై పని చేస్తయ్

న్యూఢిల్లీ: దేశంలో యూకే మ్యూటెంట్ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే యూకే మ్యూటెంట్ స్రెయిన్ కేసుల సంఖ్య 71కి చేరింది. అదే సమయంలో దేశంలో రెండు వ్యాక్సిన్‌‌లు అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యూటెంట్ వేరియంట్స్‌‌ను వ్యాక్సిన్‌‌లు ఎదుర్కోగలవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌‌ఐఆర్)లో డీజీగా ఉన్న శేఖర్ మాండే స్పందించారు. కొత్త మ్యూటెంట్ కరోనా స్ట్రెయిన్‌‌ను ఎదుర్కోగల సామర్థ్యం వ్యాక్సిన్‌‌లకు ఉన్నాయని మాండే అన్నారు.

కొత్తగా పుట్టకొస్తున్న కరోనా మ్యూటంట్ స్ట్రెయిన్స్ వేరియంట్స్‌‌పై ఇప్పటికే తయారు చేసిన వ్యాక్సిన్‌‌లు ప్రభావవంతంగా పని చేస్తున్నాయని అందరు సైంటిస్టులు నమ్ముతున్నామని మాండే చెప్పారు. ‘వ్యాక్సిన్‌‌లు అన్ని వైరస్‌‌లపైనా పని చేస్తాయి. ప్రపంచంలో పలు దేశాల్లో వస్తున్న కొత్త రకం మ్యూటెంట్‌‌‌ల మీద టీకాలు సమర్థంగా పని చేస్తాయనే నమ్మకం ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ మొదలైన తర్వాత సర్వైలెన్స్ చేస్తాం. ఇది అన్ని ప్రభుత్వాలు చేసే పనే. కేంద్రం కూడా పోస్ట్ వ్యాక్సినేషన్ సర్వైలెన్స్ నిర్వహిస్తుందని భావిస్తున్నా’ అని మాండే పేర్కొన్నారు.

Latest Updates