సాహో పోలీస్ : ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడాడు

vadodara-cop-carries-two-year-old-in-tub-on-his-head-in-neck-deep-water

గుజరాత్ లో వరదల్లో చిక్కుకున్న 15 నెలల చిన్నారిని ఎంతో ధైర్య సాహసాలతో కాపాడారు దేవిపుర SI గోవింద్ చౌద. ఐదు అడుగుల లోతు నీళ్లలో సుమారు కిలోమీటరున్నర దూరం పాపను తీసుకెళ్లి రక్షించారు. ఒక చేత్తో బుట్టను పట్టుకుని, మరో చేత్తో తాడు సాయంతో ఆయన చిన్నారిని కాపాడారు.

బుట్టలో పాపను ఉంచి.. దాన్ని తలపై పెట్టుకుని నడుము వరకు ఉన్న నీటిని దాటారు గోవింద చౌద. పసిపాపను కాపాడిన గోవింద్ చౌదకు స్థానికులు అభినందించారు. ప్రజలను కాపాడేందుకు దేనికైనా తాము సిద్ధంగా ఉంటామని గోవింద చౌద చెప్పారు.

Latest Updates